తల్లిపై ప్రేమ.. సవతి తండ్రిపై పగ.. OTTలోకి బెస్ట్ ఫ్యామిలీ డ్రామా!

OTT Suggestions- Best Family Drama A Family Affair: ఓటీటీలు వచ్చిన తర్వాత మంచి మంచి కథలను ప్రేక్షకులు ఫోన్లోనే చూస్తున్నారు. అలాంటి ఒక మంచి ప్యామిలీ డ్రామాని మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ మీకు కచ్చితంగా నచ్చేస్తుంది.

OTT Suggestions- Best Family Drama A Family Affair: ఓటీటీలు వచ్చిన తర్వాత మంచి మంచి కథలను ప్రేక్షకులు ఫోన్లోనే చూస్తున్నారు. అలాంటి ఒక మంచి ప్యామిలీ డ్రామాని మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ మీకు కచ్చితంగా నచ్చేస్తుంది.

మనదేశంలో అంటే సవతి తండ్రి, సవతి తల్లి, సవతి తమ్ముడు, సవతి చెల్లెలు వంటి రిలేషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. కానీ, విదేశాల్లో మాత్రం ఇవన్నీ సర్వ సాధారణం. పెళ్లి చేసుకున్నంత తేలిగ్గానే విడిపోతారు కూడా. ఒకరికి ఒకరితో పొసగడం లేదు అనుకుంటే వెంటనే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అయితే ఆ క్రమంలో పిల్లల జీవితాలు వివిధ రకాలుగా మారిపోతాయి. ఉదాహరణకు భార్య భర్తలు ఇద్దరికీ గతంలోనే పెళ్లి జరిగి ఉంటుంది. అయితే వాళ్లు చేసుకున్న వారితో విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటారు. రెండోసారి చేసుకున్న వారికి కూడా పిల్లలు ఉంటారు కదా.. అలా అంతా సవతి తండ్రి, సవతి తల్లి, సవతి తమ్ముడు అంటూ వరసలు వచ్చేస్తాయి. అలాంటి నేపథ్యంలోదే ఈ ఫ్యామిలీ డ్రామా.

ఈ కథలో ఒక తల్లీకూతురు ఉంటారు. ఆ తల్లికి కూతురంటే ప్రాణం. ఆ కూతురుకి తల్లంటే ఎనలేని ప్రేమ. అయితే ఆ తల్లికి మరో వ్యక్తిపై ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమని పెళ్లి బంధంగా మార్చుకోవాలి అనుకుంటారు. కానీ, ఆ కూతురు మాత్రం ఆ పెళ్లికి అంగీకరించదు. ఎందుకంటే తన తల్లి ఇష్టపడేది ఆమె బాస్ నే. అయితే ఆమె బాస్ అంటే ఆ కూతురుకి అస్సలు ఇష్టం ఉండదు. అతను ఒక సెల్ఫిష్ అని, మూర్ఖుడు అని, అవతలి వ్యక్తుల భావాలను అర్థం చేసుకోడు అని ఆమెకు గట్టి నమ్మకం. అందుకే తల్లిని అతనికి దూరంగా పెట్టాలి అనుకుంటుంది. కానీ, ఆ తల్లి మాత్రం అతనంటే పడి చచ్చిపోతుంది.

కూతురు ఎంత చెప్పినా వినకుండా ఆ తల్లి అతనితో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్లిద్దరు ఏకాంతంగా ఉండగా.. కూతురి కంట పడతారు. ఇంకేముంది అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. అతను వద్దు మొర్రో అంటూ ఆమె చెప్తుంటే తల్లి మాత్రం ఏకంగా తండ్రిగా వరస కలిపేస్తుంది. ఇలా తల్లీ కూతుళ్ల మధ్య గట్టిగానే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి చేసుకోవాలి అని ఒకరు.. వద్దు అని ఒకరు బాగానే గొడవలు పడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ అమ్మమ్మ వచ్చి కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్త కథ చెప్పాను అని తిట్టుకోకండి.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మిగిలిన కథ జూన్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా పేరు ‘ఏ ఫ్యామిలీ ఎఫైర్‘. చూస్తున్నంతసేపు మీకు బాగా నచ్చేస్తుంది. అయితే కాస్త బో*ల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే సినిమా మొత్తం ఉంటాయి అని కాదు. మూవీ చూసిన తర్వాత ఒంటరిగా పిల్లలతో ఉండే తల్లికి ఫీలింగ్స్ ఉంటాయి. ఆమెకు కూడా జీవితం ఉంటుంది. ఆమె కూడా సంతోషాలు కోరుకుంటుంది అనే పాయింట్స్ బాగా అర్థమవుతాయి. మరి.. ఈ మూవీ మీరు చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments