iDreamPost
android-app
ios-app

జాతి- కులం- మతంపై వచ్చిన బెస్ట్ డ్రామా.. OTTలో ఈ మూవీ ఇంకా చూడలేదా?

OTT Suggestions- Best Drama: ఓటీటీలో మీకు యాక్షన్ సినిమాలే కాదు.. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. ఇది మాత్రం చాలా స్పెషల్ సినిమా. చూస్తే మాత్రం రక్తం ఉడికిపోతుంది.

OTT Suggestions- Best Drama: ఓటీటీలో మీకు యాక్షన్ సినిమాలే కాదు.. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. ఇది మాత్రం చాలా స్పెషల్ సినిమా. చూస్తే మాత్రం రక్తం ఉడికిపోతుంది.

జాతి- కులం- మతంపై వచ్చిన బెస్ట్ డ్రామా.. OTTలో ఈ మూవీ ఇంకా చూడలేదా?

ఓటీటీల్లో మీరు సినిమాలు చాలావరకు వినోదం కోసం చూస్తారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం మనం ఎలా ఉండాలి అనే విషయాలపై మంచి మెసేజ్ తో తీస్తూ ఉంటారు. ఒక్కోసారి అలాంటి సినిమాలు చూస్తే ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది. అలాంటి ఒక మంచి ఇన్ స్పైరింగ్ మూవీ ఓటీటీలో అందుబాటులోనే ఉంది. మీరు ఇంకా ఎందుకు చూడలేదు అనే ఫీలవుతారు. ఆ సినిమాని ముఖ్యంగా మనం గతంలో చూసిన కులం, మతం, జాతి అనే పాయింట్లను బేస్ చేసుకుని తీశారు. ఒక్కో సీన్ కి మీకు కోపం కట్టలు తెంచుకుంటుంది కూడా. ఎందుకంటే అందులో ఉండే సీన్స్ నిజంగా ఎక్స్ ట్రీమ్ గా ఉంటాయి.

మన చరిత్రలో కులం, మతం, జాతి అంటూ చాలానే అరాచకాలు జరిగాయి. మనిషిని మతం పేరుతో హింసించడం, కులం పేరుతో దూషించడం, జాతి పేరుతో వేరు చేయడం చాలానే చూశాం. అయితే ఇప్పటికీ కొన్నిచోట్ల కులాంతర వివాహాలు జరిగితే ప్రాణాలు తీసే వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి కొన్ని దారుణమైన సంఘటనల నేపథ్యంలోనే ఈ సినిమా తీసుకొచ్చారు. ఆ మూవీలో ఒక వ్యక్తి ఈ జాత్యాహంకారం, అగ్రవర్ణం అనే పేరుతో చేసిన అరాచకాలను ఎండగట్టారు. సమాజంలో వాటి వల్ల ఎంత మంది నలిగిపోయారు అనే విషయాన్ని ప్రశ్నించాడు. అయితే ఇందులో పరిస్థితులు అన్నీ కాస్త మోడ్రన్ డేస్ కి దగ్గర ఉండటం చూస్తుంటే.. ఇంకా మన మధ్య అలాంటివి జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్పాలి అనుకున్నారేమో అనే అభిప్రాయం కలుగుతుంది. ఒకరికి జాతి వల్ల ఉద్యోగం లేక ఇంబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరు కులం వల్ల ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇరకాటంలో పడతాడు. మరొకరు ఇంకో కారణంతో నానా ఇక్కట్లు ఎదుర్కొంటాడు.

మొత్తం ఈ సినిమాలో మూడు కథలను చెప్పారు. ఇందులో సీన్స్ ఎలా ఉంటాయంటే.. లిఫ్ట్ అడిగి బండెక్కి.. దిగిన తర్వాత ఒరేయ్ నువ్వు ఆ కులం వాడివా? తెలిస్తే అస్సలు ఎక్కే వాడినే కాదు అంటాడు. అంటే వాడికి లిఫ్ట్ ఇవ్వడానికి కూడా వాడి కులం, జాతి వాడు కావాల్సి వచ్చింది. అంటే కథ పరంగా చాలానే విషయాలను ఇందులో టచ్ చేశారు. సమజానికి కొన్ని సూటి ప్రశ్నలనే సంధించారు. ఇది తమిళ్ మూవీ. నేటివిటీకి దగ్గరగా సినిమాలు తీయడంలో వారిని మించిన వాళ్లు లేరని నానుడి. కాబట్టి ఆ నమ్మకంతో అయినా మీరు ఈ సినిమా చూసేయచ్చు. ఈ మూవీ పేరు.. ‘ఎన్నుంగ సార్ ఉంగ సట్టం‘. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.