iDreamPost
android-app
ios-app

వీళ్ల డాన్స్ చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే.. OTTలో బెస్ట్ డాన్సింగ్ డ్రామా!

OTT Suggestions- Dirty Dancing Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిన హిడెన్ జమ్స్ కూడా ఒకసారి బయటకు వస్తున్నాయి. అలా వచ్చిందే ఈ మూవీ కూడా. ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్రేమ, డ్యాన్స్, ఎమోషన్ అన్నీ మిమ్మల్ని మెప్పిస్తాయి.

OTT Suggestions- Dirty Dancing Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిన హిడెన్ జమ్స్ కూడా ఒకసారి బయటకు వస్తున్నాయి. అలా వచ్చిందే ఈ మూవీ కూడా. ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్రేమ, డ్యాన్స్, ఎమోషన్ అన్నీ మిమ్మల్ని మెప్పిస్తాయి.

వీళ్ల డాన్స్ చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే.. OTTలో బెస్ట్ డాన్సింగ్ డ్రామా!

సినిమా అన్న తర్వాత చాలానే కథలు ఉంటాయి. కొంత మంది కొన్ని కథలను సినిమా తీసుకురావాలి అనుకుంటారు. ఇంకా కొందమంది తాము తీసిన కథల గురించి అందరూ మాట్లాడుకోవాలి అనుకుంటారు. అలాంటి కోవకు చెందింన సినిమా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. డ్యాన్స్ బేస్డ్ స్టోరీలు మనం తెలుగులో కూడా చూశాం. అయితే ఇది హాలీవుడ్ మూవీ. తెల్లోల్ల డ్యాన్స్ మనకు ఏం నచ్చుతుంది అని మాత్రం లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఇది ఒక మంచి లవ్ స్టోరీ. కానీ, అంతా డ్యాన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇందులో చాలానే ఎమోషనల్ పాయింట్స్ కూడా ఉంటాయి.

కథ ఏది అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. కానీ, ఆ కథని ఎలా చెప్పారు? ఏం చెప్పారు అనేదే ఇక్కడ ముఖ్యం. అదే పాయింట్ తో వీళ్లు డ్యాన్స్ ని బేస్ చేసుకుని ఒక సినిమాని తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. అయితే ఇప్పుడు చూసినా ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయిపోవాల్సిందే. ఇందులో ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ మీకు బాగా నచ్చుతుంది. అయితే ఇది అంతా డ్యాన్స్ మీద నడుస్తుందా అంటే అలా కాదు.. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. డ్యాన్స్ అనేది ఒక వ్యక్తి తన జీవితాన్ని జీవించడానికి, దానిని మార్చుకోవడానికి ఎంతగా దోహదపడుతుందో చూపించారు.

ఈ మూవీలో హీరోయిన్ కు కొంత భయం ఉంటుంది. ఆమె తన గది దాటి కూడా బయటకు రావడానికి ధైర్యం చేయదు. ఎవరితో మాట్లాడాలి అన్నా కాస్త కంగారుగానే ఉంటుంది. తండ్రి గీసిన గీతను అస్సలు దాటతు. అలాంటి అమ్మాయిని హీరో చాలా మార్చేస్తాడు. ఎంతలా అంటే తన కాళ్ల తాను నిలబడేలా.. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకునేలా. అందుకు డ్యాన్స్ ని ఒక సాధనంగా వాడుతాడు. అతను ఎంతో పట్టుదలతో ఆమెకు డ్యాన్స్ నేర్పిస్తాడు. అసలు ఆమెకు ఇది సాధ్యమేనా అని అంతా అనుకుంటారు.

తండ్రి అయితే అసలు వాళ్లను కలవద్దు అని షరతు పెడతాడు. కానీ, హీరో మాత్రం ఎవరికీ తెలియకుండా తనకు డ్యాన్స్ నేర్పుతూనే ఉంటాడు. ఒకరోజు అందరి ముందు.. ఆమె తండ్రి ముందు స్టేజ్ మీద అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన చేస్తారు. వాళ్ల డ్యాన్స్ చూసి అక్కడున్న ప్రేక్షకులే కాదు.. ఆ తండ్రి కూడా మెస్మరైజ్ అయిపోతాడు. ఆ ఫైనల్ డ్యాన్స్ చూస్తే మాత్రం ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఈ సినిమా పేరు డర్టీ డ్యాన్సింగ్. ఇది లైన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఉంది. అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ మూవీని చూడచ్చు. కాకపోతే అందుకు రూ.199 రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఈ డర్టీ డ్యాన్సింగ్ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetmarsbahis giriştaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetJojobet Giriş