iDreamPost
android-app
ios-app

డబ్బు కోసం హత్యలు.. ప్రాణ స్నేహితులను కూడా.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

  • Published Jul 02, 2024 | 5:02 PM Updated Updated Jul 02, 2024 | 5:02 PM

OTT Suggestions- Best Crime Thriller Wild Things 2: క్రైమ్ థ్రిల్లర్స్ కావాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ట్విస్టులు, షాకులకు పిచ్చెక్కిపోతారు. పైగా ఇందులో కాస్త సన్నివేశాలు కూడా ఘాటుగా ఉంటాయి. అలాగే ఆసక్తిని కూడా రేకెత్తిస్తాయి.

OTT Suggestions- Best Crime Thriller Wild Things 2: క్రైమ్ థ్రిల్లర్స్ కావాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ట్విస్టులు, షాకులకు పిచ్చెక్కిపోతారు. పైగా ఇందులో కాస్త సన్నివేశాలు కూడా ఘాటుగా ఉంటాయి. అలాగే ఆసక్తిని కూడా రేకెత్తిస్తాయి.

  • Published Jul 02, 2024 | 5:02 PMUpdated Jul 02, 2024 | 5:02 PM
డబ్బు కోసం హత్యలు.. ప్రాణ స్నేహితులను కూడా.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

మీరు తెలుగులో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. వాటిలో ఎక్కువగా డబ్బు కోసం పోరాటాలు చేయడం, మోసాలు చేయడం, హత్యలు కూడా చేయడం చూసుంటారు. మీకు గనుక అలాంటి లైన్ మూవీస్ నచ్చితే ఈ మూవీని కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ మూవీలో అదనంగా కాస్త బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. కాదు కాదు అలాంటి సీన్స్ మధ్యలోనే కథ నడుస్తూ ఉంటుంది. అయితే అదంచా చేసేది మాత్రం కేవలం డబ్బు కోసం మాత్రమే. ఈ మూవీలో ప్రేమ, త్యాగం, స్నేహం ఇలాంటి మాటలకు అస్సలు తావు ఉండదు. అంతా డబ్బు కోసం.. డబ్బు కోసమే అంతా. డబ్బు చుట్టూనే ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది.

ఒక కోటీశ్వరుడు ఉంటాడు. అతనికి ఒక భార్య ఉంటుంది. అయితే ఆ భార్య ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. ఆమె శరీరం కూడా దొరకదు. ఆమె కారు సరస్సులో పడిపోగా అందులో ఉన్న మొసళ్లు తనిశాయి అంటారు. ఆ తర్వాత ఆ కోటీశ్వరుడు కూడా ఒక విమాన ప్రమాదంలో చనిపోతాడు. అతనికి ఒక సవతి కుమార్తె మాత్రమే ఉంటుంది. ఆమెకు కాలేజ్ పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ దక్కుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి కేవలం 25 వేల డాలర్లు మాత్రమే దక్కుతాయి. అయితే ఆ కోటీశ్వరుడి మొత్తం ఆస్తి విలువ ఏకంగా 538 కోట్ల రూపాయలు. అయితే ఎవరైనా అసలు వారసులు వస్తే అది వారికి చెందుతుంది. మొత్తం ఆస్తిని వాళ్లే అనుభవించవచ్చు.

ఒకరోజు ఈ సవతి కుమార్తెకు తెలిసిన యువతి నేనే అసలైన వారసురాలిని అని వస్తుంది. తానే అతని కుమార్తెను అని చెప్తుంది. కోర్టు డీఎన్ఏ రిపోర్టును కోరుతుంది. ఆమె డీఎన్ఏ టెస్టులో కోటీశ్వరుడి కుమార్తె అనే వస్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఒకరు దర్యాప్తునకు వస్తారు. ఆమె వారసురాలా కాదా అని విచారణ చేపడతాడు. అతనికి చాలానే విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. కానీ, ఆ తర్వాత అతను జైలుపాలు అవుతాడు.

అసలు అతను ఎందుకు జైలుకు వెళ్లాడు? ఆమె నిజమైన వారసురాలు కాదా? సవతి కుమార్తె ఆస్తి మొత్తం ఇచ్చేందుకు రెడీగా ఉందా? అసలు ఆ వ్యాపారవేత్త నిజంగానే చనిపోయాడా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు, ఇంకా ఆసక్తిరేపే సమాధానాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఈ వైల్డ్ థింగ్స్ 2 సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రూ.69 రెంట్ పే చేసి ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. కాకపోతే దీనిని ఒంటరిగా చూస్తే బెటర్. కొన్ని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ వైల్డ్ థింగ్స్ 2 సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş