OTT Suggestions- Best Crime Suspense Thriller: రాత్రిపూట రాయితో చంపేస్తాడు.. పోలీసులకే ఛాలెంజ్ విసిరే సైకో కిల్లర్.. ఫ్రీగా చూసేయండి!

రాత్రిపూట రాయితో చంపేస్తాడు.. పోలీసులకే ఛాలెంజ్ విసిరే సైకో కిల్లర్.. ఫ్రీగా చూసేయండి!

OTT Suggestions- Best Crime Suspense Thriller: ఓటీటీలో తరచూ మీరు సినిమాలు చూస్తూ ఉంటే మాత్రం ఈ సినిమాని కచ్చితంగా ట్రై చేయండి. ఇందులో కథ అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ, ఎక్కడా కూడా మీరు హంతకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం కొనుగొనలేరు.

OTT Suggestions- Best Crime Suspense Thriller: ఓటీటీలో తరచూ మీరు సినిమాలు చూస్తూ ఉంటే మాత్రం ఈ సినిమాని కచ్చితంగా ట్రై చేయండి. ఇందులో కథ అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ, ఎక్కడా కూడా మీరు హంతకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం కొనుగొనలేరు.

సైకో కిల్లర్లను మీరు చాలామందినే చూసుంటారు. అదేలెండి సినిమాల్లో సైకోల సంగతి మాట్లాడుతోంది. అయితే ఈ కిల్లర్ మాత్రం మీ ఊహకు అస్సలు అందడు. క్రైమ్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. పైగా ఇది ఇప్పటి సినిమా కాదు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం విడుదలైంది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఈ చిత్రం పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఒక్కో హత్యకు, ఒక్కో ట్విస్టుకు నోరెళ్లబెట్టేస్తారు. మీరు ఎంతగా ఈ సినిమా ఊహించుకున్నా కూడా అది అంతకు మించే ఉంటుంది. ఎక్కడా కూడా మీ అంచనాలను తగ్గించదు. అలాగే మీ ఎక్స్ పెక్టేషన్స్ కి మించే ఉంటుంది.

ఒక సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అది కూడా ఫుట్ పాత్ మీద నిద్రపోయే వారిని టార్గెట్ చేసుకుని చంపుతూ ఉంటాడు. ఆద మరిచి నిద్రపోతూ ఉన్న వారి నెత్తిన ఒక పెద్ద బండరాయి వేసి వాళ్లను చంపేస్తారు. ఆ ఫుట్ పాత్ హత్యలు సిటీ మొత్తం పెద్దఎత్తున చర్చకు దారి తీస్తాయి. అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చంపుతున్నారు? ఫుట్ పాత్ మీద ఉన్న వారిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇలా చాలానే ప్రశ్నలు పోలీసులకు కూడా వస్తాయి. అందుకే ఆ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి అప్పగిస్తారు. ఆ స్పెషల్ ఆఫీసర్ మరెవరో కాదు.. కే కే మీనన్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఆయనే కరెక్ట్ అని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఈ సినిమా నుంచే అలాంటి ఒక బిరుదును అందుకున్నారు.

ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో కేకే మీనన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఆ హంతకుడిని పట్టుకోలేక కేకే మీనన్ తన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో తన స్థానాన్ని కూడా కోల్పోతాడు. కానీ, ఆ హత్యలు మాత్రం ఆగవు. అయితే కొంత దర్యాప్తు జరిగిన తర్వాత తలిసేది ఏంటంటే.. అవి హత్యలు కావు.. బలిదానాలు. అవును వారిని చంపి బలిస్తున్నారు అనే కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఆ తర్వాత ఆ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ విషయం ఎవరికీ అర్తం కాదు. అలా కథ సాగుతూ ఉంటుంది. అయితే ఈ గ్యాప్ లో ఇన్వెస్టిగేషన్ కాస్త వేగం పుంజుకుంటుంది.

ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగుతుందో.. ఆ తర్వాత క్లయిమ్యాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు సినిమా మొత్తం చూసినా కూడా అసలు హంతకుడు ఎవరో గుర్తుపట్టలేరు. అలా మీ ఊహకు అందకుండూ ఆ హంతకుడు ఉంటాడు. అతను ఎవరో తెలిశాక మీకు మబ్బులు విడిపోతాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘ది స్టోన్ మర్డర్స్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే యూబ్యూబ్ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఇప్పటికే ఈ స్టోర్ మర్డర్స్ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments