iDreamPost
android-app
ios-app

ఫిల్మ్ మేకర్స్ కి ఈ మూవీ లైబ్రరీ లాంటిది.. OTTలో ఈ సినిమాకి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Best Criem Investigation Thriller: ఓటీటీలు మీరు చాలానే కల్ట్ క్లాసిక్స్ చూసుంటారు. కానీ, ఓటీటీలో ఉన్న ఈ మూవీ ఫిల్మ్ మేకర్స్ కి అయితే ఒక లైబ్రరీలాంటిది. అలాంటి సినిమా కొన్నేళ్ల నుంచి ఓటీటీలో ఉంటే చాలామందికి తెలియక చూడలేదు.

OTT Suggestions- Best Criem Investigation Thriller: ఓటీటీలు మీరు చాలానే కల్ట్ క్లాసిక్స్ చూసుంటారు. కానీ, ఓటీటీలో ఉన్న ఈ మూవీ ఫిల్మ్ మేకర్స్ కి అయితే ఒక లైబ్రరీలాంటిది. అలాంటి సినిమా కొన్నేళ్ల నుంచి ఓటీటీలో ఉంటే చాలామందికి తెలియక చూడలేదు.

ఫిల్మ్ మేకర్స్ కి ఈ మూవీ లైబ్రరీ లాంటిది.. OTTలో ఈ సినిమాకి పిచ్చెక్కిపోతారు!

కొన్ని సినిమాలు అభిమానులను మంత్రముగ్దులను చేస్తాయి. ఇంకొన్ని సినిమాలు అయితే ఫిల్మ్ మేకర్స్ ని కూడా స్టన్ చేస్తాయి. కేవలం మెస్మరైజ్ చేయడం మాత్రమే కాదు.. ఆ మూవీ నుంచి ఇన్ స్పైర్ అయ్యేలా చేస్తాయి. ఇప్పటికీ ఈ మూవీ అంటే సినిమా మేకర్స్ కి ఒక పెద్ద లైబ్రరీ అనే చెప్పాలి. అలాంటి మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీకి ఐఎండీబీలో వచ్చిన రేటింగ్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అంతేకాకుండా.. కథ, స్క్రీన్ ప్లే అంటూ మాట్లాడుకుంటూ పోతే సినిమా మీద ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది. అయితే ఇన్ని రోజులు ఒక మాస్టర్ పీస్ ని మీరు మిస్ అయ్యారు అనే చెప్పాలి.

సాధారణంగా సినిమా చూసి బాగుంది అనుకుంటాం. లేదంటే ఇంకా బాగా నచ్చితే నలుగురికి చెప్తాం. మరీ నచ్చితే గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి చూస్తూ ఉంటాం. అలాంటి ఒక సినిమా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ మూవీ చూశాక మీకు కనీసం ఒక వారం రోజులు మైండ్ లో నుంచి పోదు. అదే సినిమా గురించి మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. పైగా ఈ సినిమా ఇప్పుడున్న హై టెక్నాలజీ సమయంలో వచ్చింది కాదు. ఎప్పుడో 1995లో వచ్చిన సినిమా. ఆ రోజుల్లోనే ఒక కల్ట్ క్లాసిక్ ని తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ఎందరో యువ డైరెక్టర్లను ఇన్ స్పైర్ చేస్తూనే ఉంది ఈ మూవీ.

ఈ సినిమాలో ఇద్దరు డిటెక్టివ్స్ ఉంటారు. వాళ్లు ఆ సిటీలో జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఒకరు కుర్ర డిటెక్టివ్ అయితే.. మరొకరు కేవలం వారంలోపే రిటైర్ కాబోతున్న డిటెక్టివ్. ఈ ఇద్దరి జోడీకి అక్కడి డిపార్ట్ మెంట్లోనే చాలా మంచి పేరు ఉంటుంది. వాళ్లు సాల్వ్ చేయలేని కేసు అంటూ ఉండదు. కానీ, అలాంటి వారికే అదిరిపోయే సవాలు ఎదురవుతుంది. ఒక కేసు మొత్తం ఆ సిటీలో ఉన్న పోలీసులకు చిక్కు ముడిలా మారుతుంది. ఆ ముడిని ఎవరు విప్పుతారు? అది కేవలం ఈ ఇద్దరు డిటెక్టివ్స్ వల్లే అవుతుంది. సిటీలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలను ఆపాలి.. ఎవరు చేస్తున్నారో కనుక్కోవాలి. ఆ బాధ్యతను హీరోలు తీసుకుంటారు.

ఈ సినిమా పేరు ‘Se7en’. ఏడు హత్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు. హత్యలు జరగడం మాత్రమే కాదు.. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఎంతో ఆసక్తిగా సాగుతూ ఉంటుంది. ఎలాంటి క్లూ లేని ఒక కేసును.. అడ్రస్ లేని హంతకుడిని వెతకడం అంటే అంత తేలిక కాదు కదా? ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కానీ, సబ్ స్క్రిప్షన్ ఉన్నా కూడా మీరు దీనిని రెంట్ బేసిస్ లోనే చూడాల్సి ఉంటుంది. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే మీరు రూ.119కు రెంట్ కి తీసుకోవాలి. ఒకసారి మనీ కట్టి స్ట్రీమింగ్ స్ట్రాట్ చేస్తే.. కేవలం 48 గంట్లలో చూసేయాలి. అయితే యూట్యూబ్ లో ట్రై చేస్తే కొన్ని ఛానల్స్ లో ఈ సెవెన్ ఫుల్ మూవీ దొరికే ఛాన్స్ కూడా ఉంది. మరి.. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి