iDreamPost
android-app
ios-app

OTTలో స్పెషల్ కాప్ డ్రామా.. ఒక్కో ట్విస్టుకు పిచ్చెక్కిపోతారు!

  • Published Jun 08, 2024 | 10:31 PM Updated Updated Jun 08, 2024 | 10:31 PM

OTT Suggestions- Best Cop Crime Thriller: ఓటీటీలో మీరు ఇప్పటికే చాలానే కాప్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇది మాత్రం కచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ట్విస్టులకు పిచ్చెక్కిపోతారు. అలాగే కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది.

OTT Suggestions- Best Cop Crime Thriller: ఓటీటీలో మీరు ఇప్పటికే చాలానే కాప్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇది మాత్రం కచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ట్విస్టులకు పిచ్చెక్కిపోతారు. అలాగే కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది.

  • Published Jun 08, 2024 | 10:31 PMUpdated Jun 08, 2024 | 10:31 PM
OTTలో స్పెషల్ కాప్ డ్రామా.. ఒక్కో ట్విస్టుకు పిచ్చెక్కిపోతారు!

ఓటీటీలు వచ్చిన తర్వాత రోజుకో సినిమా చూసేవాళ్లు కూడా పెరిగిపోయారు. వారికి రోజూ ఏదో ఒక కొత్త మూవీ ఉండాల్సిందే. అయితే రోజూ ఒక కొత్త సినిమా.. అందులోనూ మంచి సినిమా కావాలి అంటే కాస్త కష్టం అనే చెప్పాలి. కానీ, ఓటీటీలో ఇప్పటికే దుమ్మ దులిపేసిన ఎన్నో మూవీస్ ఉన్నాయి. కానీ, ఆడియన్స్ కాస్త వెనక్కి వెళ్లి వాటిని రీకాల్ చేసుకోలేకపోతున్నారు. అందుకే మీకోసం ఒక క్రేజీ కాప్ డ్రామా తీసుకొచ్చాం. నిజానికి ఈ సినిమా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. పోలీసుల డ్రామాల్లో దీనికి ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉటుంది. ఒక్కో సీన్ కి, ఒక్కో ట్విస్టుకి బుర్ర గిర్రున తిరిగేస్తుంది.

మీకు పోలీస్ డ్రామాలు, ఇన్వెస్టిగేటివ్ కాప్ స్టోరీస్ అంటే ఇష్టమా? అయితే మీకు ఈ మూవీ సూపర్ సజీషన్ అవుతుంది. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో అనుకోకుండా హత్యలు జరుగుతూ ఉంటుంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే విషయాలు తెలియవు. కానీ, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు వచ్చి ఇన్ స్పెక్టర్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, అది అంత తేలిగ్గా తేలే కేసు కాదు. ఎందుకంటే ఎలాంటి క్లూస్ లేకుండా ఆ హత్యలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక నాటకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరిని అనుమానించాలి? ఎవరిని అరెస్టు చేయాలి అనే విషయం కూడా తెలియదు. అయితే ఈ మూవీకి మాత్రం ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ మూవీ పేరు చెప్పగానే మీకు కచ్చితంగా థ్రిల్ అవుతారు. ఎందుకంటే ఈ మూవీ పేరు అతడే శ్రీమన్నారాయణ. అవును కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా చేసిన కాప్ డ్రామానే ఈ మూవీ. కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో అంటే 2019లో చాలానే సెన్సేషన్ గా మారింది. ఇందులో మంచి ఇన్వెస్టిగేషన్ ఉండటం మాత్రమే కాదు.. చాలా మంచి హ్యూమర్, కామెడీ కూడా ఉంటుంది. అలాగే ఎంతో ఫన్నీగా కనిపించే ఎస్ఐ యాక్షన్ కూడా ఇరగదీస్తాడు. ఎక్కడా కూడా ప్రత్యర్థులకు అనుమానం రాకుండా కేసు మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాడు. అలాగే సినిమాటోగ్రఫీకి ఆడియన్స్ ఫిదా అయిపోతారు. మ్యూజిక్ కూడా కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆహాలో తెలుగులోనే అందుబాటులో ఉంది. మరి.. మీరు ఇప్పటికే ఈ మూవీ చూసుంటే మాత్రం.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş