iDreamPost
android-app
ios-app

ఇలాంటి మామ దొరికితే కాపురం కాదు.. కాటికే! OTTలో బెస్ట్ కామెడీ ఫిల్మ్!

  • Published Jul 04, 2024 | 2:00 AM Updated Updated Jul 04, 2024 | 2:00 AM

OTT Suggestions- Naan Thaan Kingu Movie: ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది మామూలు కామెడీ కాదండో.. అదిరిపోయే కామెడీ మూవీ.

OTT Suggestions- Naan Thaan Kingu Movie: ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది మామూలు కామెడీ కాదండో.. అదిరిపోయే కామెడీ మూవీ.

  • Published Jul 04, 2024 | 2:00 AMUpdated Jul 04, 2024 | 2:00 AM
ఇలాంటి మామ దొరికితే కాపురం కాదు.. కాటికే! OTTలో బెస్ట్ కామెడీ ఫిల్మ్!

ఈరోజుల్లో చాలా మంది యువత కోరిక పెళ్లి. ఉద్యోగం, మంచి జీతం, కారు, ఇల్లు అన్నీ ఉన్నా పిల్లను ఇవ్వడం కష్టంగా మారిపోయింది. ఎందుకంటే అమ్మాయిలు తక్కు.. అబ్బాయిలు ఎక్కువ అయిపోయారు. అందుకే ఎంత జీతం ఉన్నా పెళ్లిళ్లు కావడం లేదు. వయసు పెరిగిపోతున్నా పిల్ల దొరకడం లేదు అని బాధ పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ హీరో మాత్రం అడగ్గానే పిల్లను ఇచ్చినా కూడా పిచ్చి పిచ్చి కష్టాలు పడుతూ ఉంటాడు. సాధారణంగా పెళ్లి కావడం లేదు అని అంతా బాధ పడితే.. ఇతను మాత్రం పెళ్లయ్యాక బాధలు పడతాడు. మరి.. ఆ పెళ్లికొడుకు కథ ఏంటో చూద్దాం.

ఈ పెళ్లి కొడుకు మరెవరో కాదు.. ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం. ఆయన ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అతని నుంచి వచ్చిన క్రేజీ కామెడీ మూవీనే ఇది. ఇందులో హీరోకి చాలానే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆఫీస్ లో కూడా చాలానే అప్పులు అవుతాయి. వాటిని తప్పించుకునేందుకు, తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఒక జమిందారు బిడ్డను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. అలా చేస్తే ఆ జమిందారు ఆస్తి తనకు వస్తుంది.. అప్పుల బాధ నుంచి తప్పించుకోవచ్చు అని భావిస్తాడు. కానీ, అక్కడ పెళ్లి తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. అదేంటంటే.. అప్పటికే జమిందారు ఫ్యామిలీ దివాళా తీసి ఉంటుంది. మన హీరోకి ఆ విషయం తెలియదు. పెళ్లైన తర్వాత అసలు విషయం తెలుసుకుంటాడు. ఆస్తి రాకపోగా.. మామ, బామ్మర్ది ఫ్రీగా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారు.

ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటే.. అప్పులు ఎదురుగా వస్తాయి. మామ వచ్చినాయన ఊరికే ఉండకుండా అన్నదానాలు అంటూ హీరో జేబుకు చిల్లి పెడుతూ ఉంటాడు. ఇవన్నీ పక్కన పెడితే చెన్నైలో బ్లాస్ట్ జరుగుతుంది. అందుకు సంబంధించిన ఒక ఉగ్రవాది హీరో వాళ్ల అపార్టుమెంట్లో చనిపోతాడు. టెర్రరిస్టులను పట్టిస్తే రూ.50 లక్షలు బహుమతి కూడా ప్రకటిస్తారు. అయితే ఆ బహుమతి కోసం హీరో ఫ్యామిలీ పెద్ద స్కెచ్చే వేస్తుంది. కానీ, అదంతా హీరో మెడకు చుట్టుకుంటుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా సినిమా మొత్తం చాలా ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమా పేరు ‘ఇంగ నాన్ ద కింగ్’. మూవీ తమిళ్ ని లైట్ తీసుకోవద్దు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేయచ్చు. బెస్ట్ కామెడీ చిత్రాన్ని మిస్ అయినవాళ్లు అవుతారు. మరి.. ఈ మూవీ చూడాలి అంటే క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet