iDreamPost
android-app
ios-app

OTTలో సూపర్ యాక్షన్ థ్రిల్లర్.. గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్!

  • Published Jul 30, 2024 | 10:52 PM Updated Updated Jul 30, 2024 | 10:52 PM

OTT Suggestions- Best ACtion Thriller Weapon Movie: ఓటీటీలోకి ఒక బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చిందని మీకు ఇంకా తెలియలేదా? ఆ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారు. పైగా ఐఎండీబీలో ఏకంగా 8 రేటింగ్ దక్కించుకున్న చిత్రం ఇది.

OTT Suggestions- Best ACtion Thriller Weapon Movie: ఓటీటీలోకి ఒక బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చిందని మీకు ఇంకా తెలియలేదా? ఆ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారు. పైగా ఐఎండీబీలో ఏకంగా 8 రేటింగ్ దక్కించుకున్న చిత్రం ఇది.

  • Published Jul 30, 2024 | 10:52 PMUpdated Jul 30, 2024 | 10:52 PM
OTTలో సూపర్ యాక్షన్ థ్రిల్లర్.. గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్!

ఓటీటీలో మీరు బాగా యాక్షన్ థ్రిల్లర్స్ చూసే వాళ్లు అయితే మాత్రం మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఇందులో ఉండే యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కి ఓటీటీ ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతుంది. సాధారణంగానే యాక్షన్ సినిమాలు అంటే ఇష్టముండే వారికి ఇది అయితే ఫేవరెట్ సినిమా అయిపోతుంది. పైగా ఇందులో మీకు ఒక సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద మనిషి లేకపోయినా కూడా ఒక సూపర్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఇస్తూనే ఉంటారు. ఇంక ఆయన బరిలోకి దిగిన తర్వాత వచ్చే హై అయితే వేరే లెవల్లో ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీపై గట్టిగానే బజ్ వస్తోంది. మరి.. ఆ మూవీ ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న మూవీలో జైలర్ సినిమాలో రజినీకాంత్ కు కొడుకుగా చేసిన యాక్టర్ వసంత్ రవి లీడ్ రోల్ ప్లే చేశాడు. అయితే ఆయన హీరో కాదండోయ్.. ఇంకో లీడ్ క్యారెక్టర్ ఉంది. అతను మరెవరో కాదు.. టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ కట్టప్ప సత్యరాజ్. అవును ఈ చిత్రంలో సత్యరాజ్ ఒక సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తాడు. అతడిని ఎలాంటి ఆయుధం తాకలేదు. ఏ బుల్లెట్ అతడికి గాయం చేయలేదు. అతను ఎలాంటి వస్తువును అయినా తాకకుండా దగ్గరకు తెచ్చుకోగలడు. ఇంకా ఇలాంటి చాలానే సూపర్ పవర్స్ అతనికి ఉన్నాయి. అయితే అవి నిజమా? టెక్నాలజీ అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు ఈ మూవీ చూడాల్సిందే.

ఈ సినిమాలో సత్యరాజ్ ఒక వాంటెడ్ పర్సన్ గా ఉంటాడు. అతని కోసం ఎంతో మంది వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అతని దగ్గర ఒక విలువైన వస్తువు ఉంటుంది. దానికోసం ఒక మినీ యుద్ధమే చేస్తూ ఉంటారు. కానీ, ప్రతిసారి సత్యరాజ్ ముందు వాళ్లు ఓడిపోతూ ఉంటారు. అయితే ఈసారి ఒక సమర్థమైన టీమ్ వస్తుంది. మరి.. వాళ్లు అయినా దానిని దక్కించుకోగలిగారా? అసలు సత్యరాజ్ ఎందుకు అందరికీ దూరంగా అలా అడవిలో ఉంటున్నాడు? అతనికి నిజంగానే సూపర్ పవర్స్ ఉన్నాయా? ఇలాంటి చాలానే ప్రశ్నలు మీకు కూడా వచ్చే ఉంటాయి. అవి తెలియాలి అంటే మీరు ఈ వెపన్ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తమిళ్ లో ఉందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్ కోసం మాత్రం ఈ మూవీ చూడచ్చు. ఐఎండీబీలో కూడా ఈ మూవీకి ఏకంగా 8/10 రేటింగ్ దక్కింది. అలాగే ఇందులో టెక్నాలజీని కూడా గట్టిగానే వాడారు. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio