iDreamPost
android-app
ios-app

OTTలో RGV మెచ్చిన చిత్రం.. యాక్షన్ కి పిచ్చెక్కిపోతారు..

OTT Suggestions- Best Action Thriller Carter Movie: ఓటీటీలో మీరు క్రేజీ థ్రిల్లర్ చూడాలి అంటే గనుక.. ఈ మూవీ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే ఇది ఆర్డీవీని కూడా మెప్పించిన చిత్రం ఇది. మూవీ స్టార్ట్ చేశాక గుండె జారిపోయే చాలానే సీన్స్ ఉంటాయి.

OTT Suggestions- Best Action Thriller Carter Movie: ఓటీటీలో మీరు క్రేజీ థ్రిల్లర్ చూడాలి అంటే గనుక.. ఈ మూవీ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే ఇది ఆర్డీవీని కూడా మెప్పించిన చిత్రం ఇది. మూవీ స్టార్ట్ చేశాక గుండె జారిపోయే చాలానే సీన్స్ ఉంటాయి.

OTTలో RGV మెచ్చిన చిత్రం.. యాక్షన్ కి పిచ్చెక్కిపోతారు..

సాధారణంగా ఒక అదిరిపోయే సినిమా చూశాం అంటే.. అది అంత తేలిగ్గా మైండ్ లో నుంచి పోదు. ఎప్పుడూ అదే సినిమా గుర్తొస్తూ ఉంటుంది. మీరు అలాంటి సినిమాలు ఇప్పటి వరకు కచ్చితంగా చూసే ఉంటారు. అలాంటి సినిమాలు మీరు ఇంకా చూడకపోతే మాత్రం ఇది ఒకటి మీ లిస్ట్ లో చేర్చుకోండి. ఎందుకంటే ఇది ఆ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమానే కాబట్టి. ఓటీటీలో మీరు ఈ రేంజ్ సినిమాని అయితే అస్సలు ఊహించి ఉండరు. పైగా ఇది స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను మెప్పించిన చిత్రం కూడా. అసలు ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కి, కెమెరా వర్క్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఆయన ఒక సీన్ ని చూపించే తీరుకు పిచ్చెక్కిపోతారు. ఇప్పటి వరకు స్క్రీన్ మీద హై ఇచ్చిన ఎన్నో సీన్స్ ని ఆర్జీవీ తీశారు. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మూవీ టేకింగ్ కి ఫిదా అయిపోయాడు. అసలు ఇలాంటి టేకింగ్ ఏంట్రా బాబు అంటూ కామెంట్ చేశాడు. ముఖ్యంగా కెమెరా పనితనం, యాక్షన్ సీక్వెన్స్ ల షూటింగ్ కి మెస్మరైజ్ అయిపోయాడు. ఆ మూవీ డైరెక్టర్, యాక్షన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ లను పొగుడుతూ 2022లో ఒక ట్వీట్ కూడా చేశాడు. అయితే అప్పట్లో ఆ మూవీని చాలామంది చూశారు కూడా. ఇప్పుడు మరోసారి అలాంటి ఒక మూవీని మీకు గుర్తు చేయాలి అనుకున్నాం.

ఈ మూవీలో హీరో ఒక ప్రాంతంలో నిద్ర లేస్తాడు. అసలు అతను ఎవరు అనే విషయం కూడా అతనికి తెలియదు. అక్కడ ఎందుకు ఉన్నాడు? తాను అసలు ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ ఉండదు. అయితే అతనికి చెవిలో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్లు చెప్పినట్లు చేయాల్సిందే అని వార్నింగ్ ఇస్తారు. అలా చేయకపోతే తల పగిలి చచ్చిపోతావ్ అంటూ బెదిరిస్తారు. నిజానికి అలా చేయకపోతే నిజంగానే వాళ్లు అతడిని చంపేయగలరు. అందుకే వాళ్లుచెప్పింది చేస్తూ ఉంటాడు. హీరో ఒక పాపను కాపాడుతూ ఉంటాడు. అసలు ఆ పాప ఎవరు? అతడిని కంట్రోల్ చేసేది ఎవరు? అసలు వాళ్లు ఎందుకు ఇతని వెంట పడుతున్నారు? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ కు, టేకింగ్ మీరు ఫిదా అయిపోతారు. ఈ మూవీ పేరు ‘కార్టర్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కాస్ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్ పీపుల్ అవాయిడ్ చేస్తే మంచిది.