Tirupathi Rao
OTT Suggestions- Best Action Drama The Equalizer: ఓటీటీల్లో యాక్షన్ మూవీస్ కి కొదవ లేదు. కానీ, అన్నీ యాక్షన్ డ్రామాలు ఓ పట్టాన నచ్చవు. అయితే ఇది మాత్రం అదిరిపోయే మూవీ. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారు.
OTT Suggestions- Best Action Drama The Equalizer: ఓటీటీల్లో యాక్షన్ మూవీస్ కి కొదవ లేదు. కానీ, అన్నీ యాక్షన్ డ్రామాలు ఓ పట్టాన నచ్చవు. అయితే ఇది మాత్రం అదిరిపోయే మూవీ. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారు.
Tirupathi Rao
ఓటీటీలో మీరు చాలా జానర్స్ లో ఇప్పటికే మూవీస్ చూసుంటారు. కానీ, యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రం కాస్త స్పెషల్ గా అనిపిస్తాయి. ఎందుకంటే యాక్షన్ థ్రిల్లర్స్ లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. దాని వెనుక ఒక బలమైన కథ ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకొకరిపై దాడి చేశారు అంటే అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అందుకే యాక్షన్ మూవీస్ లో అంతర్లీనంగా ఒక ఎమోషనల్ డ్రామా, కన్నీళ్లు తెప్పించే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానికి అదనంగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ యాక్షన్ డ్రామా రైడ్ ని మీకోసం తీసుకొచ్చాం. మరి.. ఆ మూవీ ఏదీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఎందుకు అంత స్పెషలో కూడా చూద్దాం.
సాధారణంగానే హాలీవుడ్ సినిమాలు అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటాయి. అలాంటి సినిమాలో మంచి స్టోరీ లైన్ కూడా ఉంటే? ఇంకేముంది శుభం కార్డు పడిన తర్వాత వావ్ అని నోరెళ్లబెట్టేస్తాం. ఈ కథ కూడా అలాంటిదే. అతను చాలా సింపుల్ గా బతికేసే మిడిల్ ఏజ్డ్ పర్సన్. ఒక హార్డ వేర్ మార్ట్ లో పనిచేస్తూ ఉంటాడు. ఏదైనా ప్రమాదం ఉన్నా.. చెడు జరిగినా సర్దుకుపోవాలి అనే రకం. అయితే ఇదంతా కేవలం పగటి పూట వరకు మాత్రమే. రాత్రైతే కథ వేరుంటది. మీరు మార్వెల్ యూనివర్స్ నుంచి ఎంతో మంది సూపర్ హీరోలను చూసుంటారు. అయితే కొన్ని సినిమాల్లో ఎలాంటి వేషాలు, స్పెషల్ పవర్స్ లేని సూపర్ హీరోలు కూడా ఉంటారు. అలాంటి కోటాకు చెందిన వ్యక్తే ఇతను.
మన హీరో చేసేవన్నీ మంచి పనులే కానీ, అదనంగా శక్తులు ఉండవు అంతే. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే వారిని కాపాడేందుకు రెడీ అయిపోతాడు. అలా తన కళ్లముందు ఏ చెడు జరిగినా అస్సలు తట్టుకోలేడు. అయితే అతని గురించి ఎవరికీ తెలియదు. తన విషయాలు చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. చాలా సింపుల్ గా బతికేస్తూ ఉంటాడు. కానీ, యాక్షన్ లోకి దిగితే మాత్రం పట్టుకోవడం కష్టం. ఐదుగురు ఉన్నా 19 సెకన్లలో కొట్టేస్తాడు. ఎలాంటి వెపన్ అయినా ఈజీగా వాడేస్తాడు.
అసలు ఎందుకు మంచి చేయాలి అనుకుంటున్నాడు? అతను గతంలో ఏం చేశాడు? ఎక్కడ ఉండేవాడు? ఎలా ఉండేవాడు? ఎవరితో ఉండేవాడు? అనే చాలానే ప్రశ్నలు ఉంటాయి. అతను మార్క్ చేశాడు అంటే మాత్రం తప్పించుకోవడం కష్టం. ఈ మూవీలో ఉండే సైలెంట్ ఎలివేషన్స్ కేజీఎఫ్ రేంజ్ లో ఉంటాయి. ఎక్కడా తగ్గడు. ఈ మూవీ పేరు ‘ది ఈక్వలైజర్’. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, జియో సినిమా వంటి ప్రముఖ ఓటీటీల్లో చాలాచోట్లే అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.