OTT Action Adventure Movie: OTT లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'అపోకలిప్టో'.. ఇంకా చూడలేదా!

OTT లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘అపోకలిప్టో’.. ఇంకా చూడలేదా!

OTT Action Adventure Movie: ఫైట్ లు , యాక్షన్ సిక్వెన్స్ లు ఉండే ఇలాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. కేవలం ఇలాంటి సీన్స్ తోనే కథను అద్భుతంగా తెరపైన చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే.

OTT Action Adventure Movie: ఫైట్ లు , యాక్షన్ సిక్వెన్స్ లు ఉండే ఇలాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. కేవలం ఇలాంటి సీన్స్ తోనే కథను అద్భుతంగా తెరపైన చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే.

ఇప్పుడు చెప్పుకోబోయే కథ చాలా సింపుల్.. కానీ దీనిలో ఉండే యాక్షన్ సీన్స్ ,కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ను గెస్ చేయడం మాత్రం చాలా కష్టం . కేవలం యాక్షన్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ.. మొత్తం కథను నడిపించే సినిమాలు.. ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా దాదాపు ఇలాంటిదే. ఈ సినిమా చూస్తే అసలు యాక్షన్ సీన్స్ అంటే ఇలా ఉంటాయా అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. నార్త్ అమెరికాలో మెసో అమెరికన్ అడవులు ఉంటాయి. అక్కడ మాయన్ అనే తెగకు చెందిన ప్రజలు నివసిస్తూ ఉండే వారు. వారిలో ఒకడైన జాగ్వార్ పా అనే వ్యక్తి.. ఒక రోజు వేటకు వెళ్తాడు. అక్కడ నుంచి తీసుకువచ్చిన మాంసంతో.. కుటుంబ సభ్యులంతా కలిసి.. సంతోషంగా వేడుక చేసుకుంటారు. అయితే అక్కడ అప్పటికే.. ఒక తెగ వారు మరొక తెగ వారిపై దాడి చేసి.. మనుషులను చంపడం , దాడి చేయడం , వారిని బానిసలుగా మార్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా జాగ్వార్ పా హ్యాపీగా ఉన్న సమయంలో.. కొంతమంది వేరే తెగ వారు వీరిపై అట్టాక్ చేస్తారు. ఇది ముందే గమనించిన జాగ్వార్ పా తన కుటుంబాన్ని ముందే ఎవరికీ కనిపించకుండా దాచేస్తాడు. మరో వైపు వేరే తెగ వారు.. వీరిని దొరికిన వాళ్ళను దొరికినట్టుగా బంధించడం, ఆడవారిని బానిసలుగా మార్చుకోవడం చేస్తూ ఉంటారు. అసలు జాగ్వార్ ఫ్యామిలీ పై ఎటాక్ చేసింది ఎవరు ? ఎందుకు అలా చేస్తారు ? ఆ తర్వాత ఏమైంది ? జాగ్వార్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా లేదా ? ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితిలు ఏంటి ? ఇవన్నీ చెప్పడం కంటే కూడా సినిమాలో చూస్తూనే ఆ సీన్స్ ను ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తరువాత ఏమైందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “అపోకలిప్టో”. ఇలాంటి యాక్షన్ ఎంటెర్టైనెర్స్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే ఓటీటీ లో చాలా యాక్షన్ ఎంటర్టైనర్స్ చూసి ఉంటారు. కానీ ఇలాంటి మూవీ మాత్రం చూసి ఉండరు. కేవలం ఈ మూవీని సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కూడా అనొచ్చు. ఎందుకంటే రేపటి కోసం తనని తన కుటుంబాన్నీ .. కాపాడేందుకు జాగ్వర్ అనే వ్యక్తి ఎలాంటి.. పరిస్థితులను ఎదుర్కున్నాడు అనేది ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.కాబట్టి ఈ సినిమాను కనీసం ఓసారై చూసి తీరాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments