iDreamPost
android-app
ios-app

పడక గదిలో భార్యకు నరకం! ఇంత బోల్డ్ సిరీస్ OTTలో ఉందని తెలుసా?

OTT Suggestions Web Series: ఓటీటీలో చాలానే సినిమాలు ఉన్నాయి. వాటిలో చాలా తక్కువ మాత్రమే మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. వాటిలో భార్యాభర్త జంటగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఇన్నాళ్లు మిస్ అయ్యారా?

OTT Suggestions Web Series: ఓటీటీలో చాలానే సినిమాలు ఉన్నాయి. వాటిలో చాలా తక్కువ మాత్రమే మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. వాటిలో భార్యాభర్త జంటగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఇన్నాళ్లు మిస్ అయ్యారా?

పడక గదిలో భార్యకు నరకం! ఇంత బోల్డ్ సిరీస్ OTTలో ఉందని తెలుసా?

ఓటీటీలో అన్నీ యాక్షన్ చిత్రాలు, సిరీస్లే కాదు.. కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ఉంటాయి. కానీ, చాలామంది అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. నిజానికి వారు చూడరు అని కాదు.. వారికి ఆ చిత్రాల గురించి తెలియక. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. నిజానికి పెళ్లి అయిన వాళ్లు, పెళ్లి కావాల్సిన వాళ్లు తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ అది. ఇది ఏ సర్టిఫికేట్ సిరిసే.. కాస్త బోల్డ్ గా కూడా ఉంటుంది. కానీ, జంటగా ఈ వెబ్ సిరీస్ చూస్తే అసలు పెళ్లి అంటే ఏంటి? పెళ్లి తర్వాత పడక గదిలో జరిగే లైసెన్స్డ్ రే*ప్స్ అంటే ఏంటి? అసలు ఉమెన్ అబ్యూజ్ అంటే ఏంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అసలు ఆ వెబ్ సిరీస్ ఏదో చూద్దాం.

ఈ వెబ్ సిరీస్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. దీనిలో నటించిన తిరువీర్ అప్పుడు అంత ఫేమస్ కాకపోవచ్చు. కానీ మసూద సినిమా వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయ్యాడు. ఈ తిరువీర్ ఆనంద్ పాత్రలో ఈ వెబ్ సిరీస్ లో యాక్టిగ్ ఇరగదీశాడు. ఈ వెబ్ సిరీస్ పేరు సిన్. ఇది 2020లో ఆహాలో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు బోల్డ్ కంటెంట్ అంటే ఈ సిరీస్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. చెప్పాలి అనుకున్న మెసేజ్ కి కాస్త బోల్డ్ వేలో చెప్పారు. అంతేగానీ సిరీస్ మాత్రం తప్పక చూడాల్సిన లిస్ట్ లో ఉంటుంది.

ఈ వెబ్ సిరీస్ లో తిరువీర్ ఒక కన్నింగ్ హస్బెండ్ లా, ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వాడిలా డిఫరెంట్ షేడ్స్ లో మంచిగా యాక్టింగ్ చేశాడు. అలాగే ఆనంద్ భార్యగా దీప్తీ సాతి, లవర్ గా జెన్నీఫర్ కూడా అద్భుతంగా నటించారు. ఈ సిరీస్ లో లీడ్ రోల్ యాక్టర్స్ నటన వల్ల ఈ సిరీస్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇంక కథ విషయానికి వస్తే.. ఆనంద్ మంచి అనే ముసుగులో ఉంటూ ఉంటాడు. నందితాని వివాహం చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు పడకగదిలోనే ఆనంద్ అసలు స్వరూపం తెలుస్తుంది.

ఆనంద్ ఒక సె*క్స్ అడిక్ట్ లా ఉంటాడు. భార్య అంగీకారంతో అతనికి పని లేదు. అతనికి కావాలి అంటే భార్య అంగీకరించాల్సిందే. అలాంటి వ్యక్తి లైఫ్ లోకి నైనా వస్తుంది. నైనా చాలా త్వరగా ఆనంద్ తో ప్రేమలో పడిపోతుంది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం, అతనితో కలిసి జీవిచడం వంటి కాన్సెప్ట్ ని ఆమె తీసుకోలేదు. అసలు ఆనంద్ ఏం చేయాలి అనుకుంటున్నాడు? నందితాని భార్యగా ఒప్పుకుంటాడా? నైనా కోసం నందితను బలి చేస్తాడా? అసలు ఆనంద్ మంచివాడేనా? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం సిన్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet