iDreamPost
android-app
ios-app

OTTలోకి క్రేజీ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jul 01, 2024 | 8:52 PM Updated Updated Jul 01, 2024 | 8:52 PM

OTT New Releases- Soori Garudan Movie: ఓటీటీలోకి ప్రతివారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా ఆ లిస్టు బాగా పెద్దగానే ఉంది. కానీ, వాటిలో ఈ మూవీ మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పాల్సిందే.

OTT New Releases- Soori Garudan Movie: ఓటీటీలోకి ప్రతివారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా ఆ లిస్టు బాగా పెద్దగానే ఉంది. కానీ, వాటిలో ఈ మూవీ మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పాల్సిందే.

  • Published Jul 01, 2024 | 8:52 PMUpdated Jul 01, 2024 | 8:52 PM
OTTలోకి క్రేజీ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈవారం కూడా అలాగే కొన్ని కొత్త సినిమాలు వస్తున్నాయి. కానీ, వాటిలో ఒక సినిమా మాత్రం ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ తన సత్తా చాటింది. పైగా ఇందులో ఉండే యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాకుండా.. ఇందులో ఒకరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే ఈ మూవీలో చాలానే హైలెట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. మరి.. ఆ మూవీ ఏది? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది? ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకరు సూరి, రెండు శశికుమార్, మూడు ఉన్ని ముకుందన్. వీళ్లు ముగ్గురు తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతులే. సూరి మాత్రం కమెడియన్ గానే మనకు బాగా తెలుసు. కానీ, గత కొన్నిరోజులుగా హీరోగానే ఎక్కువ అలరిస్తున్నాడు. అతను- విజయ్ సేతుపతి తీసిన విడుదలై సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ మూవీ కూడా తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో కథ, స్క్రీన్ ప్లేనే కాకుండా.. ఎమోషన్, ఫ్లాష్ బ్యాక్ లాంటి కాన్సెప్ట్స్ కూడా బాగానే ఉన్నాయి.

ఈ మూవీలో శశికుమార్- ఉన్ని ముకుందన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వాళ్లిద్దరు ఊరిలో పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ ఉంటారు. వారికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు కూడా ఉంటారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ రైట్ హ్యాండ్ గా సూరి పనిచేస్తూ ఉంటాడు. ఉన్ని ముకుందన్ మీద ఈగ కూడా వాలనివ్వని పాత్ర అది. ఆ తర్వాత వారి జీవితాల్లో జరిగే పెను మార్పుల వల్ల.. అంతా శత్రువులాగ మారిపోతారు. అప్పటి వరకు విశ్వాసంతో ఉన్న సూరి కూడా ఎదురు తిరగడం స్టార్ట్ చేస్తాడు. ఎవరి ప్రాణం కోసం వాళ్లు పాకులాడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇన్నాళ్లు బతికింది ఒక బతుకేనా అంటూ సూరి కత్తి పట్టుకుంటాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? శశికుమార్- ఉన్ని ముకుందన్- సూరిల మధ్య ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ ‘గరుడన్’ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ జూలై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş