iDreamPost
android-app
ios-app

OTTలోకి మంచి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT New Releases- Best Middle Class Movie: ఓటీటీలోకి ఒక మంచి మిడిల్ క్లాస్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇలాంటి తరుణంలో చైతన్యరావు నటించిన ఒక సూపర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

OTT New Releases- Best Middle Class Movie: ఓటీటీలోకి ఒక మంచి మిడిల్ క్లాస్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇలాంటి తరుణంలో చైతన్యరావు నటించిన ఒక సూపర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

OTTలోకి మంచి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగు ప్రేక్షకులకు చైతన్యరావు పేరు చెప్పగానే ఒక యూట్యూబ్ సిరీస్ బాగా గుర్తొస్తుంది. అది మరేదో కాదు.. 30 వెడ్స్ 21 సిరీస్. ఈ సిరీస్ లో చైతన్యరావు తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. అంతేకాకుండా వెండితెర మీద కూడా అతను చేసిన చాలా మంచి పాత్రలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన కీడా కోలా సినిమాలో చైతన్యరావు యాక్టింగ్ కు మంచి అప్లాజ్ లభించింది. తరుణ్ భాస్కర్ ఒక మంచి క్యారెక్టర్ ను చైతన్యరావుకు ఇచ్చాడు. దానికి అతను కూడా న్యాయం చేశాడు. ఇప్పుడు చైతన్యరావు హీరోగా ఒక మంచి మిడిల్ క్లాస్ మూవీ వస్తోంది. త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి.. ఆ వివరాలేంటో చూద్దాం.

చైతన్యరావు- భూమిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా మార్చి నెలలో థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఒక మంచి మిడిల్ క్లాస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అందుకే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా అని బాగానే వెయిట్ చేశారు. వారి ఆశలు తీరాయి. త్వరలోనే షరతులు వర్తిస్తాయి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. తాము ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించింది.

ఆహా ప్లాట్ ఫామ్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసింది. “ఒక మంచి మిడిల్ క్లాస్ సినిమా చూడాలి అని ఉందా? అయితే షరతులు వర్తిస్తాయి” అంటూ సినిమా ఓటీటీ ఎంట్రీపై పోస్ట్ చేసింది. ఈ నెల 18 నుంచి ఆహాలో ఈ షరతులు వర్తిస్తాయి మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నీటి పారుదల శాఖలో చిరంజీవి(చైతన్యరావు) క్లర్క్ గా చేస్తూ ఉంటాడు. తన చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్న తలకెత్తుకుంటాడు. అందరి బాగోగులు చూసుకోవడం మాత్రమే కాకుండా.. తన చిన్ననాటి ఫ్రెండ్ విజయశాంతిని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటాడు. అప్పటి వరకు బాగానే ఉన్న వారి జీవితాలు ఒక చిట్టీల వ్యాపారంతో రోడ్డున పడినంత పని అవుతుంది. అసలు ఆ చిట్టీల వ్యాపారం ఏంటి? చిరంజీవి కుటుంబం అందులో ఎలా చిక్కుకుంటుంది? వారికి జరిగిన అన్యాయం ఏంటి అనేదే సినిమా. మరి.. ఆ కష్టాలను చిరంజీవి ఎలా అధిగమించాడు? ఆ మోసాలను తిప్పికొట్టాడా లేదా? తెలియాలంటే ఆహాలో షరతులు వర్తిస్తాయి చూసేయాల్సిందే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet