iDreamPost
android-app
ios-app

అఫీషియల్: OTTలోకి క్రేజీ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jul 01, 2024 | 8:24 PM Updated Updated Jul 01, 2024 | 8:24 PM

Market Mahalakshmi Movie Release Date: ఓటీటీలోకి ఒక క్రేజీ లవ్ స్టోరీ రాబోతోంది. ఈ సినిమాలో ప్రతి సీన్ కి.. ప్రతి డైలాగ్ పడి పడి నవ్వాల్సిందే. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

Market Mahalakshmi Movie Release Date: ఓటీటీలోకి ఒక క్రేజీ లవ్ స్టోరీ రాబోతోంది. ఈ సినిమాలో ప్రతి సీన్ కి.. ప్రతి డైలాగ్ పడి పడి నవ్వాల్సిందే. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

  • Published Jul 01, 2024 | 8:24 PMUpdated Jul 01, 2024 | 8:24 PM
అఫీషియల్: OTTలోకి క్రేజీ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

లవ్ స్టోరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే మార్కెట్ లోకి విరివిగా ఈ లవ్ స్టోరీలు వస్తూ ఉంటాయి. అయితే చాలా వరకు ఒకటే బేస్ లైన్ తో ఈ మూవీలు సాగుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటి ఒక రొటీన్ లైన్ తోనే వచ్చిన మూవీ. కానీ, ఇది మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఒక మంచి ఫీల్ ఉంది. మీరు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయ్యింది అని ఫీలవుతుంటే మాత్రం ఈ చిత్రం మీకు మంచి ఛాయిస్ అవుతుంది. త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది కూడా. మరి.. ఆ మూవీ ఏది.. ఆ కథ ఏంటో చూద్దాం.

ఈ మూవీ పేరు మార్కెట్ మహాలక్ష్మి. ఇందులో ప్రముఖ నటుడు పార్వతీశం హీరోగా చేశాడు. ఈ మూవీతో మరోసారి పార్వతీశం హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే ప్రణీక అన్విక హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎదిగొచ్చిన కొడుకుకి ఎలాగైనా పెళ్లి చేయాలి అని చూసే తండ్రి. తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని చూసే కొడుకు. వీళ్లిద్దరి అభిప్రాయాలు ఒక పట్టాన కలవ్వు. ఆ కొడుకు పెళ్లి కాదు. ఇదే పాయింట్ మీద సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది. తండ్రేమో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే.. కొడుకు మాత్రం మార్కెట్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

కథ చూస్తే.. తండ్రికి కట్నం మీద ఆశ ఉంటుంది. కొడుకు పెళ్లి చేసి కనీసం కోటి రూపాయలు అయినా కట్నం వస్తుంది అని కలలు కంటూ ఉంటాడు. కానీ, ఆ కొడుకు మాత్రం తెచ్చిన ఏ సంబంధం నచ్చలేదు అంటూ సాకులు చెప్తూ ఉంటాడు. అలా ఎందుకు చెప్తున్నాడో ఆ తండ్రికి అర్థం కాదు. రెండు కోట్లు కట్నం ఇస్తామనే సంబంధానికి కూడా నో చెప్పేస్తాడు. అతను మాత్రం మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెను ఎలాగైనా తన ప్రేమలో పడేయాలి అని తెగ ట్రై చేస్తుంటాడు. ఆ అమ్మాయి మాత్రం ఛీ కొట్టి లాగి పెట్టి లెంపకాయ వేస్తుంది. మరి.. ఆ తండ్రి కోరిక తీరుతుందా? ఈ అబ్బాయి ప్రేమ గెలుస్తుందా? తెలియాలి అంటే మీరు మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడాల్సిందే. ఈ మూవీ జూలై 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom