iDreamPost
android-app
ios-app

చావాల్సిన యువతి మహారాణిగా.. OTTలోకి బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్!

OTT New Releases- Best Action Drama My Lady Jane: ఓటీటీలోకి ఒక క్రేజీ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఆ సిరీస్ చూస్తే మీరు కచ్చితంగా ప్రేమలో పడిపోతారు. ప్రస్తుం ఆ సిరీస్ ఓటీటీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

OTT New Releases- Best Action Drama My Lady Jane: ఓటీటీలోకి ఒక క్రేజీ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఆ సిరీస్ చూస్తే మీరు కచ్చితంగా ప్రేమలో పడిపోతారు. ప్రస్తుం ఆ సిరీస్ ఓటీటీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

చావాల్సిన యువతి మహారాణిగా.. OTTలోకి బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్!

రియల్ లైఫ్ లో కూడా కొందరి జీవితాలను అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. అప్పుడే చేతిలో చిల్లగవ్వ లేకుండా రోడ్ల మీద కనిపిస్తారు.. అంతలోకే కోటీశ్వరులు అవుతారు. అలాంటి కథలు సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా చాలానే జరిగాయి. నిజానికి నిజ జీవితాల ఆధారంగానే ఈ సినిమా కథలు వస్తూ ఉంటాయి. అలాంటి పాయింట్ మీద ఒక మంచి వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. ఈ సిరీస్ ని మీరు చూడగానే ప్రేమలో పడిపోతారు. ఎందుకంటే ఇందులో ఉన్న యువరాణి కూడా అలా ఓ కుర్రాడని చూడగానే ప్రేమలో పడుతుంది. నిజానికి అది ప్రేమ కాదు.. కానీ, ప్రేమ అనుకుంటుంది. అయితే ఆ తర్వాత ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేదే పాయింట్ ఇక్కడ.

సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో ఒక పాయింట్ అయితే కామన్ గా ఉంటుంది. అదేంటంటే.. రాజ కుటుంబంలో అమ్మాయి పుట్టింది అంటే ఆమెను మరో బలమైన రాజ్యానికి కోడలిని చేస్తారు. ఎందుకంటే ఆ పెళ్లి ద్వారా సంబంధం కలుపుకుని వారి సైనిక శక్తిని పెంచుకోవాలి అనుకుంటారు. అంతేకాకుండా ఆ బలమైన రాజ్యం నుంచి వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు. అలాగే ఇవతలి రాజ్యం కూడా పెళ్లి పేరుతో అందమైన యువరాణిని పొందడమే కాకుండా.. వారి వంశాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకుంటారు. అలా పెళ్లి పేరుతో ఇరు కుటుంబాలు బలపడతాయి. కానీ, అక్కడ ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు, కోరికలు ఎవరికీ అవసరం ఉండదు.

My Lay Jane

ఈ వెబ్ సిరీస్లో కూడా ఒక యువరాణికి అలాంటి పరిస్థితే వస్తుంది. కానీ, ఆమె తన పెళ్లిని కాదని పారిపోతుంది. అంతేకాకుండా.. తాను ఒక వ్యక్తిని చూడగానే అతని మైకంలో పడిపోతుంది. ఎలాగైనా అతనితో జీవితం పంచుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఆ యువకుడు కూడా ఆమెను ప్రేమిస్తాడు. అయితే అప్పటికే అతను పీకల్లోతు కష్టాల్లో ఉంటాడు. ఈమె కూడా మహారాజుని కాదని పెద్ద తప్పు చేస్తుంది. అప్పటికే ప్రాణాలు పోయే అంత ప్రమాదాలు చాలానే చూసి ఉంటుంది.

ఆ తర్వాత వాళ్లిద్దరు కలిసి వారి కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే యువరాణిగా ఉన్న యువతి మహారాణి కావాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. అయితే ఇదంతా చేసేది మాత్రం తన లైఫ్ తనకు నచ్చినట్లుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే అనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ‘మై లేడీ జేన్’. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet