iDreamPost
android-app
ios-app

రెండేళ్ల తర్వాత OTTలోకి క్రేజీ హారర్ థ్రిల్లర్! వణికించేస్తుంది..

OTT New Movie Releases- Grandma Movie: ఒక మంచి హారర్ థ్రిల్లర్ కోసం మీరు చూస్తుంటే మాత్రం.. మీకోసం ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది ఏకంగా రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది.

OTT New Movie Releases- Grandma Movie: ఒక మంచి హారర్ థ్రిల్లర్ కోసం మీరు చూస్తుంటే మాత్రం.. మీకోసం ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది ఏకంగా రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది.

రెండేళ్ల తర్వాత OTTలోకి క్రేజీ హారర్ థ్రిల్లర్! వణికించేస్తుంది..

ఓటీటీలు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటి వల్ల ప్లస్ ఏంటంటే.. ఎప్పుడో రిలీజు అయిన సినిమాలను కూడా ఇప్పుడు ఓటీటీలో చూసేయచ్చు. మేకర్స్ కూడా తమ సినిమాని కొన్నేళ్ల గ్యాప్ వచ్చినా కూడా ఓటీటీలో విడుదల చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఒక్కరోజులోనే ఆ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. పైగా అందులో 7/జీ బృందావన కాలనీ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సోనియా అగర్వాల్ కూడా లీడ్ రోల్ ప్లే చేయడం విశేషం. అంతేకాకుండా.. ఈ మూవీలో క్రేజీ ట్విస్టులు కూడా ఉంటాయి.

ఈ కోలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీలో సోనియా అగర్వాల్, విమలారామన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ చిత్రం 2022 జులైలో థియేటర్లలో విడుదలైంది. అయితే ఆ తర్వాత ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. జులై 23 నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రానికి థియేటర్ రిలీజ్ సమయంలోనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో కావాల్సినన్ని ట్విస్టులు ఉంటాయి. అలాగే అమ్మమ్మ ఆత్మ చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. సోనియా కేర్ టేకర్ పాత్రలో నటించింది. విమలారామన్ లాయర్ పాత్రలో కనిపిస్తుంది.

కథ ఏంటంటే?:

లాయర్ ప్రియాంక భర్తకు దూరంగా ఉంటుంది. ఆమె తన కుమార్తెతో ఒంటరిగా బంగ్లాళో ఉంటుంది. ఆమె దగ్గర కేర్ టేకర్ గా సోనియా అగర్వాల్ చేస్తుంటుంది. నిక్కీకి అమ్మమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అయితే అమ్మమ్మ చనిపోవడంతో నిక్కీ దిగులుగా ఉంటుంది. అసలు రూమ్ లో నుంచి బయటకు కూడా రాదు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అయితే త్రిష జాబ్ లో చేరిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో అమ్మమ్మ ఆత్మ ఉందని.. దానితోనే నిక్కీ మాట్లాడుతోందని ఆమె గ్రహిస్తుంది. అయితే అమ్మమ్మ ఆత్మగా ఎందుకు మారింది? ఆ బంగ్లాలోనే ఎందుకు తిరుగుతోంది? ప్రియాంక ప్రత్యర్థుల నుంచి నిక్కీకి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? అసలు లాయర్ ప్రియాంకకు శత్రువులు ఎందుకు ఉన్నారు? వాళ్లు ఆమె నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు ఈ ‘గ్రాండ్ మా’ మూవీని ఆహా తమిళ్ లో చూడాల్సిందే.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş