OTT లో బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఒక మూవీ లో ఇన్ని ట్విస్ట్ లా!

OTT Best Psychological Mystery Thriller : కొన్ని సినిమాలు జాగ్రత్తగా చివరి వరకు చూస్తే కానీ.. అసలు మూవీలో ఉన్న ట్విస్ట్ ఏంటోఅర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Psychological Mystery Thriller : కొన్ని సినిమాలు జాగ్రత్తగా చివరి వరకు చూస్తే కానీ.. అసలు మూవీలో ఉన్న ట్విస్ట్ ఏంటోఅర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు. కానీ ఇలాంటి సినిమా మాత్రం చూసి ఉండరు. అయితే వీటిలో కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ.. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థంకాదు. అలాగే కొన్ని సినిమాలు ట్విస్ట్ ల మధ్యలో సినిమాలు ఉన్నాయా.. సినిమా మధ్యలో ట్విస్ట్ లు ఉన్నాయా అనే రేంజ్ లో ట్విస్ట్ లు ఉంటూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలైతే.. చివరి వరకు చూస్తే కానీ.. అసలు మూవీలో ఉన్న ట్విస్ట్ ఏంటో అర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి .

ఈ సినిమా కథ విషయానికొస్తే.. పోలీసులకు అర్ధరాత్రి నడి రోడ్ మీద ఖాళీగా ఉన్న కార్ దొరుకుతుంది. ఆ కార్ ఎవరిదా అని ఆరా తీయగా ఆ కార్ ఫేమస్ హీరోయిన్ ఉమా సత్య మూర్తిది అని తెలుస్తుంది. ఇంకా ఆ కార్ లో ఓ మొబైల్ కూడా దొరుకుతుంది. అయితే ఎవరో తనని కిడ్నప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతాయి. ఈ కేసును ఓ ప్రముఖ ఐపియస్ ఆఫీసర్ కు అప్పగిస్తారు. దీనితో అప్పటినుంచి దొరికిన ఫోన్ తో విచారణ చేపడతారు. కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ.. వారికి కొన్ని ఆశ్చర్య పోయే నిజాలు తెలుస్తాయి. అయితే దానిలో ఈ కేసును విచారిస్తున్న ఐపియస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఒక అతను అనుమానితుడుగా ఉంటాడు. అతని పేరు ఎక్సెలెక్స్. అతను ఓ కమిషనర్. అప్పటికే అతను ఓ ప్రాబ్లమ్ లో చిక్కుకుంటాడు. కానీ తానూ మాత్రం ఉమా కు తనకు సంబంధం లేదని చెప్తాడు. దీనితో ఆ ఐపియస్ ఆఫీసర్ ఈ కేసును కనుక ఎక్సెలెక్స్ సాల్వ్ చేస్తే.. తనపై ఉన్న విచారణను తొలగిస్తానని చెప్పడంతో అతను ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒప్పుకుంటాడు.

అప్పటినుంచి ఉమా ఫ్రెండ్స్ అందరిని కూడా విచారించడం మొదలు పెడతాడు. వారిలో మెల్విన్ , షెరీన్ అనే అమ్మాయిలపై అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే వారికి అక్కడ గతంలో జరిగిన గొడవల గురించి చెప్పుకొస్తారు. మెల్విన్ అనే అమ్మాయి చాలా మందిని చంపేస్తుంది. ఇప్పుడు ఉమాను చంపింది కూడా మెల్విన్ ఏ నా.. అసలు ఎవరు ఈ మెల్విన్ , ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు ? గతంలో ఆమె ఎందుకు హత్యలు చేసింది ? ఎందుకు వీరు హీరోయిన్ ఉమా సత్య మూర్తిని టార్గెట్ చేశారు ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఈ విషయాలన్నీ తెలియాలంటే “వేట” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. నిద్రపోతే కలలోకి వచ్చి చంపేసే సైకో కిల్లర్.. OTT లో వణుకుపుట్టించే సైకో థ్రిల్లర్

Show comments