iDreamPost
android-app
ios-app

30 మంది బ్రతకడం కోసం మనిషి మాంసం తినాల్సి వస్తే! OTTలో రియల్ స్టోరీ!

  • Published Aug 05, 2024 | 5:25 PM Updated Updated Aug 05, 2024 | 5:25 PM

OTT Real Survival Thriller : తెలుగులో మంజుమ్మేల్ బాయ్స్ సినిమా చూసిన దగ్గర నుంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ మీద.. మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు . ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

OTT Real Survival Thriller : తెలుగులో మంజుమ్మేల్ బాయ్స్ సినిమా చూసిన దగ్గర నుంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ మీద.. మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు . ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

  • Published Aug 05, 2024 | 5:25 PMUpdated Aug 05, 2024 | 5:25 PM
30 మంది  బ్రతకడం కోసం మనిషి మాంసం తినాల్సి వస్తే! OTTలో  రియల్ స్టోరీ!

నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు చూడడానికి.. చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అందులోను సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చూడడం అంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. తెలుగులో మంజుమ్మేల్ బాయ్స్ సినిమా చూసిన దగ్గర నుంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ మీద.. మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వారికి ఆ ప్రమాదం ఎలా ఎదురయ్యింది. దాని నుంచి వారు ఎలా బయటకు వచ్చారు. ఇలా అన్నిటిని ఈ మూవీస్ లో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1972 అక్టోబర్ లో కొంతమంది రబ్బీ ప్లేయర్స్ కొద్దీ రోజుల్లో చిల్లి అనే దేశానికీ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. వారిలో కొంతమంది ఫస్ట్ టైమ్ వారి దేశం వదిలి మరొక దేశం వెళ్తారు. దీనితో గేమ్ తర్వాత వారు అక్కడ ఎదో ఒక ట్రిప్ కు వెళ్లాలని డిసైడ్ అవుతారు. దీనితో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీని ఆ ట్రిప్ కు ఇన్వైట్ చేస్తారు. దీనితో 13 అక్టోబర్ 1972 న 40 మంది ప్రయాణికులు చిల్లి కు బయల్దేరుతారు. వారంతా చిల్లికి వెళ్లాలంటే మధ్యలో ఉండే ఓ మౌంటెన్ ను దాటాలి. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంటుంది. ఆ మౌంటైన్స్ మీద నుంచి ఏమైనా వెళ్తే.. అవి వాటిని అట్ట్రాక్ట్ చేసుకుంటాయి. సో ప్లేన్ డ్రైవ్ చేసే వాళ్ళు ఆ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆరోజు కూడా ఆ ప్లేన్ డ్రైవర్ ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా కూడా.. ఆ మౌంటెన్ ఈ ప్లేన్ ను అట్ట్రాక్ట్ చేసుకోవడంతో.. ప్లేన్ అక్కడికక్కడే కూలిపోతుంది. ఆ సమయంలో వెనుక భాగం విరిగి వెంటనే మంచులో పడిపోతుంది.. ముందు భాగం కొంచెంసేపు గాలిలో ఎగిరి అక్కడ పడిపోతుంది.

కట్ చేస్తే ఆ ప్లేన్ కూలిపోయినప్పుడే సగానికి సగం మంది చనిపోతారు. కొంతమంది కొన ఊపిరితో ఉండగా.. కొంతమందికి తీవ్రమైన గాయాలు అవుతాయి. మరి కొంతమందికి చిన్న చిన్న గాయాలు అవుతాయి . ఈ విషయాన్నీ రెస్క్యూ టీమ్ కు చెబుదాం అన్నా కూడా వారి దగ్గర ఏ కమ్యూనికేషన్ టూల్ ఉండదు. ఈ క్రమంలో అక్కడ చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో.. ఆ చలికి తట్టుకోలేక మరి కొంతమంది చనిపోతారు. అలా రెండు మూడు రోజులు గడిచే సరికి ప్రాణాలతో 27 మంది మాత్రమే ఉంటారు. వారికి తినడానికి కూడా ఏమి ఉండదు. వీరంత కూడా రెస్క్యూ టీమ్ కోసం ఎదురుచూస్తూ వారం రోజులు గడిపేస్తారు. ఇక వారిలో కొంతమంది ఆకలికి తట్టుకోలేక షూ లెస్ లు , సిగరెట్లు , ఆఖరికి వారి చర్మాన్ని కూడా తింటారు. ఇంకొంత సమయానికి అక్కడే చనిపోయిన మనుషులను కోసుకుని తింటారు. ఇలా 11 రోజులు గడిచిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిలో ఎంత మంది బ్రతికారు ? వీరు ఆ మౌంటెన్ నుంచి బయటపడ్డారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే.. “సొసైటీ ఆఫ్ ది స్నో” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.