iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ప్రోమేతియస్’ .. చూశారా!

  • Published Aug 17, 2024 | 12:46 PM Updated Updated Aug 23, 2024 | 6:04 PM

OTT Best Science Fiction Thriller: ఏలియన్స్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే అసలు మనుషులు భూమి మీదకు ఎలా వచ్చారు? ఎవరు సృష్టించారు ? ఇలాంటి ప్రశ్నలు అందరికి ఉండే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Science Fiction Thriller: ఏలియన్స్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే అసలు మనుషులు భూమి మీదకు ఎలా వచ్చారు? ఎవరు సృష్టించారు ? ఇలాంటి ప్రశ్నలు అందరికి ఉండే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Aug 17, 2024 | 12:46 PMUpdated Aug 23, 2024 | 6:04 PM
OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ప్రోమేతియస్’ .. చూశారా!

సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలలో అయితే పాస్ట్ , లేదా ఫ్యూచర్ కు సంబంధించిన ప్లాట్స్ ను చూపిస్తూ ఉంటారు. సాధారణంగా అందరికి ఈ రెండిటి గురించి తెలుసుకోవాలంటే ఆసక్తి ఉంటుంది. అయితే అసలు భూమి మీదకు మనుషులు ఎలా వచ్చారు ? మనుషుల్ని సృష్టించింది ఎవరు ? సృష్టించిన వ్యక్తి ఎక్కడ ఉంటారు ? అలాగే ఏలియన్స్ భూమి మీదకు ఎలా వచ్చాయి ఇలా ప్రతి ఒక్కరికి చాలా ప్రశ్నలు ఉంటాయి. వీటి అన్నిటికి సమాధానాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. భూమి మీద ఎలాంటి జీవ రాసి లేదు అనే సీన్స్ ను చూపిస్తారు. ఎటు చూసిన కొండలు , నదులు ఉండేవి. సరిగ్గా అదే సమయంలో స్పేస్ నుంచి ఓ ఏలియన్ భూమి మీదకు వస్తుంది. ఓ జలపాతం అంచున నుంచుని.. తనతో తెచ్చుకున్న లిక్విడ్ ను తాగుతుంది. ఇక ఆ లిక్విడ్ తాగిన వెంటనే ఆ ఏలియన్ బాడీ పార్ట్శ్ అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి.. ఆ జలపాతంలో కలిసిపోతుంది . ఆ వాటర్ లో పడిన ఏలియన్ డిఎన్ఏ నుంచి కొత్త డిఎన్ఏ ఫార్మ్ అయ్యి.. భూమి మీద కొత్త జీవ రాసి ఏర్పడుతుంది. అలా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయి.. మానవ జాతి చాలా అభివృద్ధి చెందుతుంది.

Promothesus

కట్ చేస్తే కథను 2091 సంవత్సరాన్ని చూపిస్తారు. కొంతమంది సైన్టిస్ట్ ల గ్రూప్.. ఐర్లాండ్ లోని కొండలలో తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అక్కడ వారు ఓ గుహలో 3500 సంవత్సరాలకు ముందు గీసిన ఓ పిక్చర్ ను చూపిస్తారు. ఆ చిత్రంలో ఓ మనిషి కొన్ని నక్షత్రాలను చూపిస్తారు. దానిని చూసి వీరంతా కూడా చాలా సంతోషపడతారు. అప్పటినుంచి ఆ సైన్టిస్ట్ లంతా మనుషులను సృష్టించిన వారు ఆ పిక్చర్ లోనే ఉన్నారని.. వారు మనల్ని స్పేస్ కు ఇన్వైట్ చేస్తున్నారని.. ఈ పిక్చర్ ద్వారా దారి చూపిస్తున్నారని నమ్ముతారు. దీనితో ఆ సైన్టిస్ట్ లంతా కలిసి .. స్పేస్ షిప్ లో వేరే గ్రహానికి వెళ్తారు. వీళ్ళ బాధ్యతంతా ఓ రోబో తీసుకుంటుంది. వారంతా రెండు సంవత్సరాలకు ఆ గ్రహానికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? వారు ఆ గ్రహానికి వెళ్లి మనుషుల్ని సృష్టించింది ఎవరో కనుకున్నారా లేదా ? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ‘ప్రోమేతియస్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.