iDreamPost
android-app
ios-app

ఈ హరర్ మూవీ తీస్తూనే ఆరుగురు మృతి.. OTTలో ఇది చూడాలంటే గట్టి గుండె కావాలి!

  • Published Jul 19, 2024 | 5:00 AM Updated Updated Jul 19, 2024 | 5:00 AM

OTT Real Horror Movie : ఇప్పుడు ఎక్కడ చూసిన హర్రర్ మూవీస్ గురించే టాక్ వినిపిస్తుంది. హర్రర్ మూవీస్ అంటే అందరికి భయమే.. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అయితే సినిమా షూటింగ్ సమయంలోనే భయంతో కొంతమంది చనిపోయారట. అసలు ఏంటి ఈ సినిమా చూసేద్దాం.

OTT Real Horror Movie : ఇప్పుడు ఎక్కడ చూసిన హర్రర్ మూవీస్ గురించే టాక్ వినిపిస్తుంది. హర్రర్ మూవీస్ అంటే అందరికి భయమే.. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అయితే సినిమా షూటింగ్ సమయంలోనే భయంతో కొంతమంది చనిపోయారట. అసలు ఏంటి ఈ సినిమా చూసేద్దాం.

  • Published Jul 19, 2024 | 5:00 AMUpdated Jul 19, 2024 | 5:00 AM
ఈ హరర్ మూవీ తీస్తూనే ఆరుగురు మృతి.. OTTలో ఇది చూడాలంటే గట్టి గుండె కావాలి!

కొన్ని హర్రర్ మూవీస్ చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. గుండె దైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి.. ఈ సినిమాను ఒంటరిగా మాత్రం చూడకండి.. అంటూ అప్పుడప్పుడు హర్రర్ మూవీస్ వచ్చే ముందుకు ఇలాంటి సజెషన్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ రేంజ్ లో భయపెట్టే హర్రర్ సినిమాలలో భయపెట్టే ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని కల్పిత కథలైతే.. మరికొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అయితే.. ఏకంగా మూవీ తీసేటప్పుడే కొంతమంది నటి నటులు.. భయపడి చనిపోయారట. సినిమా చూసి భయంతో వణికిపోయారంటే సరే అనుకోవచ్చు.. కానీ సినిమా తీసినప్పుడే భయంతో చనిపోయారంటే.. హర్రర్ మూవీ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా మరేదో కాదు 1982 లో హాలీవుడ్ లో వచ్చిన.. “పోల్టర్‌గైస్ట్” మూవీ. ఈ సినిమాను టోబీ హూపర్ డైరెక్ట్ చేయగా.. ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బెర్గ్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఈ హర్రర్ మూవీ తీసిన సమయంలోనే సెట్ లో అందరికి వణుకు పుట్టించాయట కొన్ని సీన్స్. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ఒక కుటుంబం నివసిస్తున్న.. ఇంటి పైన వరుసగా దెయ్యాలు దాడి చేసి.. అదే ఇంట్లో ఉండే వాళ్ళ కూతురిని ఎత్తుకుని వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? ఎందుకు ఆ దెయ్యాలు ఆ ఇంటిపై దాడి చేస్తాయి? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో ఒక లేడి అస్థిపంజరాలు ఉన్న ఓ చెరువులోకి దూకుతుంది. షూటింగ్ సమయంలో.. ఆ చెరువులో డమ్మీ ఆస్థి పంజరాలు పెట్టకుండా నిజమైన అస్థి పంజరాలను పెట్టారట మేకర్స్ .

దీనితో.. ఈ మూవీ చేసిన వారిని శాపం తగిలిందని.. మూవీ తీస్తున్న సమయంలోనే.. ఆరుగురు చనిపోయారని టాక్ వినిపించింది. ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటికీ కూడా ఆ సెట్ లో దెయ్యం ఉండడం కారణంగానే వారంతా చనిపోయారని అందరు నమ్ముతారు. దీనితో ఈ సినిమా ఇప్పటికి ఓ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఈ మూవీ మొదటి పార్ట్ బాగా హిట్ కావడంతో.. దీనికి కంటిన్యుషన్ గా మరో రెండు పార్ట్శ్ వచ్చాయి. ప్రస్తుతం పోల్టర్‌గైస్ట్ పార్ట్ 1,2,3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ మూవీస్ ను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTT లో పృథ్విరాజ్ సుకుమారన్ అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet