iDreamPost
android-app
ios-app

OTT లో పృథ్విరాజ్ సుకుమారన్ అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే!

  • Published Jul 18, 2024 | 1:00 AM Updated Updated Jul 18, 2024 | 1:00 AM

OTT Best Horror Suspense Thriller: ఆత్మలు , దెయ్యాలు ఇలాంటి కథలు చాలా ఇంట్రెస్టింగ్.. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా ఇలాంటిదే మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Suspense Thriller: ఆత్మలు , దెయ్యాలు ఇలాంటి కథలు చాలా ఇంట్రెస్టింగ్.. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా ఇలాంటిదే మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 18, 2024 | 1:00 AMUpdated Jul 18, 2024 | 1:00 AM
OTT లో పృథ్విరాజ్ సుకుమారన్ అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే!

కొన్ని కథలు ఎలాంటి రిఫరెన్స్ తీసుకుని రూపొందిస్తారో తెలియదు కానీ.. వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆత్మలు , దెయ్యాలు లాంటి కథలైతే.. ఎన్ని వచ్చినా కానీ ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని హర్రర్ సినిమాలలో అయితే .. ఎన్నో ఏళ్ల క్రితం పగపట్టిన దెయ్యాల కథలు కూడా ఉంటూ ఉంటాయి. దేవుడు , దెయ్యం నిజంగా ఇవన్నీ ఉన్నాయా.. ఇలాంటి సినిమాలు చూస్తే మాత్రం ఉన్నాయనే అందరు నమ్ముతారు. ఇలాంటి సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓ వైపు భయపెడుతూనే , మరో వైపు ఆసక్తికరంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలు చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే… కేరలలో జీవిష్ మతానికి చెందిన వ్యక్తి మోషి. అతను చనిపోవడంతో.. అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మీడియా , పొలిటీషియన్స్ కూడా అక్కడకు వస్తారు. మోసక్క అనే అతను ఒక ఆంటిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. మోషి చనిపోయిన తరువాత అతని దగ్గర ఉన్న ఓ అంటిక్ బాక్స్ ను దొంగలించి అతని షాప్ లో పెట్టుకుంటాడు. అయితే ఇతని షాప్ లో సెబాస్టియన్ అనే వ్యక్తి పని చేస్తూ ఉంటాడు . ఓ రోజు అతని యజమాని లేని సమయంలో.. ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తాడు.. ఓపెన్ చేసిన వెంటనే అతను చనిపోతాడు. అసలు అతను ఎలా చనిపోయాడు అనే విషయంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక మరోవైపు.. రంజన్ , ప్రియా అనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. రంజన్ ఓ న్యూకియర్ పవర్ ప్లాంటు కు సంబంధించిన కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ప్రియకు అంటిక్ వస్తువులంటే ఇష్టం.. సో ఆమె మోసక్క షాప్ నుంచి అదే బాక్స్ ను కొని ఇంటికి తీసుకుని వస్తుంది. వచ్చి ఓపెన్ చేసిన వెంటనే ఆ బాక్స్ లో ఉన్న దెయ్యం ప్రియలోకి ప్రవేశిస్తుంది.

అప్పటినుంచి వాళ్ళ ఇంట్లో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తన ఒంట్లో దెయ్యం ఉన్నట్లు ఆమెకు కూడా తెలియదు. రంజన్ కూడా వాటిని పట్టించుకోడు. ఇక వీరికి అక్కడ ఫాదర్ శ్యాం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను దాని వెనుక ఉన్న కారణాలు వెతుకుతాడు. దానికి కారణం ఆ బాక్స్ ఏ అని చెప్తాడు ఫాదర్. ఇక అప్పటినుంచి ఆ బాక్స్ గురించి తెలుసుకోడం మొదలు పెడతారు. అసలు బాక్స్ లో ఉన్న ఆత్మ ఎవరిదీ ? ఎందుకు జెవిష్ మతానికి చెందిన వారి దగ్గర ఆ బాక్స్ ఉంది ? అందులో దెయ్యం ఎందుకు ఉంది? ఆ బాక్స్ లో ఉన్న దెయ్యం ఎందుకు అందరిని చంపేస్తుంది ? ప్రియను మాత్రం ఎందుకు చంపదు? చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే “ఎజ్రా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. ట్విస్ట్ ల పై ట్విస్ట్ లు.. అంతుచిక్కని రహస్యాలు! OTT లో ఈ మూవీ మిస్ కావద్దు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom