OTT Suggestions-Best Horror Suspense Thriller : ఆ ఇంటి వైపు వెళ్తే పిచ్చివాళ్లుగా మారి వస్తారు. OTT లో ఇలాంటి హర్రర్ సస్పెన్స్ ఉందా !

ఆ ఇంటి వైపు వెళ్తే పిచ్చివాళ్లుగా మారి వస్తారు. OTT లో ఇలాంటి హర్రర్ సస్పెన్స్ ఉందా !

OTT Best Horror Suspense Thriller: హర్రర్ మూవీస్ అన్నీ ఒకే రకంగా అయితే అసలు ఉండవు. కొన్ని సార్లు దెయ్యాలు కనిపిస్తూ భయపెడితే.. కొన్ని సార్లు కనిపించకుండా భయపెడుతూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లకైతే మైండ్ పోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Suspense Thriller: హర్రర్ మూవీస్ అన్నీ ఒకే రకంగా అయితే అసలు ఉండవు. కొన్ని సార్లు దెయ్యాలు కనిపిస్తూ భయపెడితే.. కొన్ని సార్లు కనిపించకుండా భయపెడుతూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లకైతే మైండ్ పోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

హర్రర్ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలను చూసినా కానీ ప్రేక్షకులకు అసలు బోర్ కొట్టించకుండా.. ప్రతి కథలోనూ ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అందుకోసమే హర్రర్ మూవీస్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే హర్రర్ మూవీస్ అన్నీ ఒకే రకంగా అయితే అసలు ఉండవు. కొన్ని సార్లు దెయ్యాలు కనిపిస్తూ భయపెడితే.. కొన్ని సార్లు కనిపించకుండా భయపెడుతూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లకైతే మైండ్ పోతుంది. ఈ క్వాలిటీస్ అన్నీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో కనిపిస్తాయి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో పీనాన్స్ లేన్ లో ఉండే ఓ ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటికి ఓ గ్యాంగ్ వస్తుంది. వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎవరు లేరని గుర్తించి.. వాళ్ళు దొంగతనం చేసిన డబ్బులను అక్కడ పెడదాం అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో వాళ్లకు రక్తపు మరకలు కనిపిస్తాయి. కానీ దాని గురించి కూడా ఆలోంచించకుండా.. డబ్బులు దాచిపెట్టడానికి అదే సరైన ప్లేస్ అని ఫిక్స్ అవుతారు. దీనితో వారిలో ఒకరు ఆ ఇంటి బేస్ మెంట్ లో డబ్బులు దాచిపెట్టడానికి వెళ్ళినప్పుడు.. అక్కడ ఎవరో అతనిపై అట్టాక్ చేస్తారు. దాని నుంచి తప్పించుకుని అందరి దగ్గరకు వచ్చి చూస్తే .. వారందరిపై కూడా ఎదో కనపడని శక్తి ఎటాక్ చేస్తుంది . దీనితో వారంతా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి.. అది ఒక ఘోస్ట్ హౌస్ అని వారు గుర్తిస్తారు.

కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. ఈ సీన్ లో అదే టౌన్ కు వచ్చిన క్రిమ్సన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను కూడా ఓ క్రిమినల్ అవ్వడం వలన అప్పుడే జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. కానీ ఈసారి అతను మారిపోయి ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం అని అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతను పనికోసం ఫాదర్ జాన్ అనే వ్యక్తిని కలుస్తాడు. అది కూడా మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఇంటికే వెళ్తాడు. అప్పుడు ఆ ఫాదర్ ఈ ఇల్లు నాదే పాతపడిపోయింది కాబట్టి.. ఇక్కడే ఉంటూ దానిని బాగు చేసే పనిని అప్పగిస్తాడు. క్రిమ్సన్ అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి అక్కడ వింత పరిస్థితులు ఎదురౌతూ ఉంటాయి. పగలంతా నార్మల్ గానే ఉన్నా సరే … రాత్రయ్యే సరికి అక్కడ ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. పైగా ఆ ఇంటికి ఎవరు వచ్చినా కానీ వారిని ఆ దెయ్యాలు భయపెడుతూనే ఉంటాయి.. వారంతా పిచ్చివాళ్లలా మారిపోతారు. అసలు క్రిమ్సన్ ఆ ఇంటికే ఎందుకు వెళ్ళాడు ? ఆ ఫాదర్ జాన్ ఎవరు ? స్టార్టింగ్ లో ఆ ఇంట్లో డబ్బు దాచిపెట్టిన వారు ఏమౌతారు ? ఆ ఇంట్లో ఉన్నది ఆత్మలేనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇవన్నీ తెలియాలంటే “పినాన్స్ లేన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments