iDreamPost
android-app
ios-app

కోరి చేసుకున్న భర్త సైకో అయితే.. భార్య పరిస్థితి! OTT లో ఆలోచింపజేసే మూవీ

  • Published Aug 05, 2024 | 4:28 PM Updated Updated Aug 05, 2024 | 4:28 PM

OTT Emotional Drama: కామెడీ , హర్రర్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఎమోషనల్ డ్రామ మూవీస్ కు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. మరి ఓటీటీ లో ఓ మంచి ఎమోషనల్ మూవీ చూడాలంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్.

OTT Emotional Drama: కామెడీ , హర్రర్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఎమోషనల్ డ్రామ మూవీస్ కు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. మరి ఓటీటీ లో ఓ మంచి ఎమోషనల్ మూవీ చూడాలంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్.

  • Published Aug 05, 2024 | 4:28 PMUpdated Aug 05, 2024 | 4:28 PM
కోరి చేసుకున్న భర్త సైకో అయితే.. భార్య పరిస్థితి! OTT లో ఆలోచింపజేసే మూవీ

క్రైమ్ డ్రామాస్ , ఇన్వెస్టిగేషన్ కథలు , హర్రర్ మూవీస్ ఇవన్నీ కూడా చూడడానికి థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ చూసి చూసి బోర్ కొట్టేసి.. ఓ మంచి ఎమోషన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ మధ్య కాలంలో ఎమోషనల్ డ్రామా మూవీస్ కు కూడా బాగానే డిమాండ్ పెరుగుతుంది. అందులో ముఖ్యంగా భార్య భర్తల కథలు.. చూసేందుకు మంచి ఫీల్ ను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే… సినిమా స్టార్టింగ్ లో ఒక పెళ్లి ఇంటిని చూపిస్తారు. కొత్తగా పెళ్ళైన దంపతులను ఓ గదిలోకి పంపించి.. మిగిలిన వారంతా నిద్రపోతారు. కట్ చేస్తే ఆ ఇంటి పెద్ద కోడలు సంపూర్ణ తన భర్తతో ఉన్న సమయంలో… ఆమెకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, ఏంటా అని వెళ్లి చూస్తే.. కొత్త పెళ్లి కూతురు ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె పేరు నందిని. ఏంటి ఏమైంది అని సంపూర్ణ అడుగుతుంది. ఇక్కడ అసలు గతంలో ఏం జరిగింది అనేది చూపిస్తారు. సంపూర్ణ మరిదికి పెళ్ళి సెట్ అవుతుంది. దీనితో ఇంట్లో హడావిడి జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆమె అత్తగారు వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా ఉంది.. జాతకాలు కలవలేదు అని చెప్తుంది. దీనితో అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక్కడ నందిని ఫ్యామిలీని చూపిస్తారు. వీరికి ఈ విషయం తెలియగానే వీరు కూడా టెన్షన్ లో ఉంటారు. మరో వైపు పెళ్ళికొడుకు కూడా అంతే బాధలో ఉంటాడు.

దీనితో పెళ్ళికొడుకు అమ్మ అదే ముహూర్తానికి తన కొడుకుకి వేరే పెళ్ళి చేద్దాం అనుకుని.. అతనికి చెప్తుంది. అతనికి మాత్రం వేరే పెళ్ళి చేసుకోవడం లేదు. ఎలా అయినా నందినిని మాత్రమే పెళ్ళి చేసుకుంటా అని తన వదినకు చెప్పి వెళ్ళిపోతాడు. దీనితో ఎలాగూ ఒకలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఇక్కడ స్టోరీని ప్రెసెంట్ లో చూపిస్తారు. అసలు లోపల ఏమైందంటే.. తన భర్త ఆమెను శారీరికంగా టార్చర్ చేస్తాడు. కట్ చేస్తే ఓసారి వీరిద్దరూ కలిసి ట్రిప్ కు వెళ్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమె తన భర్తకు భయపడుతూ అతనికి కనిపించకుండా పోతుంది. ఎలాగూ ఒకలా ఆమెను కనిపెట్టి.. ఇంటికి తీసుకుని వస్తాడు. ఈ విషయాన్నీ ఇంటికి వచ్చిన తర్వాత సంపూర్ణకు చెప్తుంది. దీనితో సంపూర్ణ ఈ విషయంలో ఎదో ఒకటి చేయాలనీ అనుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది ? నందినికి తన భర్తకు మధ్య సమస్యలు తొలగిపోతాయా లేదా ? తన భర్త మారతాడా లేదా ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే.. “సంపూర్ణ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమాలో ప్రసారం అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet