OTT Suggestion - Telugu Suspense Thriller : వెయ్యేళ్లనాటి విగ్రహం కోసం పోరాటం.. ఆ ట్విస్ట్ కు మైండ్ పోతుంది!

OTT Suggestion: వెయ్యేళ్లనాటి విగ్రహం కోసం పోరాటం.. ఆ ట్విస్ట్ కు మైండ్ పోతుంది!

Telugu Best Suspense Thriller In OTT: హర్రర్ సినిమాల తర్వాత ప్రేక్షకులంతా ఎక్కువగా ఇష్టపడేది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలనే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Telugu Best Suspense Thriller In OTT: హర్రర్ సినిమాల తర్వాత ప్రేక్షకులంతా ఎక్కువగా ఇష్టపడేది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలనే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్ట్ సీన్ లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలో కలిగిస్తూ.. చివరి వరకు ఎటు కదలకుండా సినిమా మొత్తం చూసేలా చేస్తాయి. అందుకే దాదాపు చాలా మంది ఇలాంటి సినిమాలను చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ లో చాలా రకాల ప్లాట్స్ ఉంటూ ఉంటాయి.. ఒక్కో సినిమా ఒక్కో రకమైన కొత్త కథతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. వీటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఇంకాస్త డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. కొన్ని సినిమాలు చూసిన తరవాత అరే ఇన్ని రోజులు ఇలాంటి సినిమాను ఎలా మిస్ చేశాం అనే ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాను చూసినా అలానే అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

అసలు ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమాలో ఆది అనే ఓ నిజాయితీపరుడైన యువకుడు ఉంటాడు. అతనికి డబ్బు బాగా అత్యవసరం కావడంతో.. విగ్రహాలు దొంగతనం చేసే ఓ ముఠాతో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ మైత్రేయన్ తో కలిసి పనిచేయడానికి అంగీకరిస్తారు. సినిమా మొత్తం కూడా పురాతన విగ్రహాలు, విలువైన దేవుడి విగ్రహాలను స్మగ్లింగ్ చేయడం ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహల మాఫియా గ్యాంగ్ వలన ఆది జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి! ఆది లైఫ్ లో కి ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వస్తాడు ! అసలు అతనికి ఉన్న కష్టాలేంటి ! విగ్రహాల స్మగ్లింగ్ వలన అతనికి కావాల్సిన డబ్బు దొరుకుతుందా ! లేదా అతను ఏదైనా సమస్యలో పడతాడా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ” పరంపొరుళ్” . ఇది ఒరిజినల్ గా తమిళ్ మూవీ అయినా కూడా.. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాలో అమితాస్ ప్రధాన్ , శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ లో కాస్త బోర్ అనిపించినా కూడా.. చివరి వరకు చూస్తే కానీ.. అసలు ట్విస్ట్ ఏంటి అనేది తెలియదు. ఇక ఇప్పటికే తమిళ్ లో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ప్రేక్షకులు చూసి ఉంటారు. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments