OTT Suggestions- Best Horror Movie: ఇంటి బేస్మెంట్ లో కుప్పలుగా ఆత్మలు.. OTT లో చెమటలు పట్టించే మూవీ

OTT Suggestions: ఇంటి బేస్మెంట్ లో కుప్పలుగా ఆత్మలు.. OTT లో చెమటలు పట్టించే మూవీ

OTT Best Horror Movie : హర్రర్ సినిమాలలో రకరకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. ఈ కథలన్నీ కూడా దెయ్యాలు , ఆత్మలు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

OTT Best Horror Movie : హర్రర్ సినిమాలలో రకరకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. ఈ కథలన్నీ కూడా దెయ్యాలు , ఆత్మలు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

దెయ్యాలు , ఆత్మలతో ఆటలు ఆడే సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. హర్రర్ సినిమాలంటే ప్రతి ఒక్కరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ చూసేందుకు ఇంకా చాలా సినిమాలు మిగిలే ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. ఒంటరిగా అయితే ఈ మూవీని అసలు చూడొద్దు. ఎందుకంటే ఈ సినిమాలో ఏకంగా దెయ్యాలు , ఆత్మలతోనే ఆటలు ఆడుతూ మాట్లాడుతూ ఉంటుంది.. ఓ ఫ్యామిలీ. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1967 లో లాస్ ఏంజెల్స్ లోని ఓ ఇంట్లో ఎలిస్ అనే ఓ భర్త చనిపోయిన లేడి.. తన ఇద్దరు కూతుర్లు లీనా , డోరి ని యూజ్ చేసుకుని.. చనిపోయిన వారితో మాట్లాడుతున్నట్లు ప్రజలందరినీ మోసం చేస్తుంది. ఓ రోజు లీనా తన ఫ్రెండ్ ని కలవడానికి బయటకీ వెళ్తుంది. అక్కడ లీనా తన ఫ్రెండ్ ఇంట్లో యుజి బోర్డు ని చూస్తుంది. ఆ బోర్డుని బయటకు తీసి.. గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ లో వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడంతో వారు భయపడతారు. ఈలోపు తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ రావడంతో ఆ బోర్డును దాచిపెట్టేస్తారు. ఇక తర్వాత రోజు ఉదయం.. ఎలిస్ కొన్ని బుక్స్ తో పాటు.. మార్కెట్ లో కనిపించే యుజి బోర్డు ను కూడా కొంటుంది. దీనిని లీనా చూస్తుంది. ఎలిస్ ఆ యుజి బయటకీ తీసి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఈ క్రమంలో ఆ బోర్డు నుంచి మార్కస్ అనే ఓ స్పిరిట్ బయటకు వచ్చి.. డోరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిని లీనా గమనిస్తుంది.

ఇక ఆ తర్వాత.. డోరి తనలో ఉన్న మార్కస్ ఆత్మను ఓ ఫ్రెండ్ గా అనుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత రోజు వాళ్లకు బ్యాంక్ నుంచి నోటీసు వస్తుంది. కట్టాల్సిన డబ్బు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ నోటీసులో ఉంటుంది. దీనితో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో.. డోరి లో ఉన్న మార్కస్ ఆత్మ వాళ్ళ ఇంటి బేస్మెంట్ లో డబ్బులు ఉన్నాయని.. చెప్పి హెల్ప్ చేస్తుంది. ఇదంతా ఆ యుజి బోర్డు వలెనే జరుగుతుందని తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. లీనా , డోరీలకు వాళ్ళను ఎవరెవరో ఎదో చేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఆ బోర్డులోనుంచి మరో ఆత్మ కూడా ప్రవేశిస్తుంది. అయితే డోరీలో ఉన్న మార్కస్ ఆత్మ.. ఓ సైకో కిల్లర్ అని. ఆ డెడ్ బాడీస్ అన్నిటిని ఆ ఇంటి బేస్మెంట్ లో ఉంచాడని తెలుస్తుంది. అసలు ఎవరు ఈ మార్కస్ ఎందుకు అందరిని చంపేస్తాడు ? ఆ ఇంట్లోనే ఎందుకు ఉంచుతాడు ? డోరీస్ శరీరంలోనే ఉండడానికి కారణం ఏంటి ? అసలు ఆ ఇంటి బేస్మెంట్ లో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ? ఎలిస్ , లీనా , డోరి ఈ ఆత్మల వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇవన్నీ తెలియాలంటే “ఓయిజా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments