OTT suggestion- OTT Web Series: OTT లో థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది.. పోలీస్ జాబ్ ఇంత కష్టమా!

OTT Web Series : OTT లో థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది.. పోలీస్ జాబ్ ఇంత కష్టమా!

OTT suggestion- OTT Web Series: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ , సిరీస్ అంటే ఇష్టమైన వారు అయితే ఈ సిరీస్ ను అసలు మిస్ అయ్యి ఉండరు. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూసేద్దాం.

OTT suggestion- OTT Web Series: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ , సిరీస్ అంటే ఇష్టమైన వారు అయితే ఈ సిరీస్ ను అసలు మిస్ అయ్యి ఉండరు. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూసేద్దాం.

సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ లకు ఈ మధ్య ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే వెబ్ సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ కు ఓ ట్విస్ట్ ఉంటుంది. దీనితో ఈ సినిమాలను చూసేందుకు బాగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు.. ఇక వెబ్ సిరీస్ లు అన్నీ కూడా హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలోనే కొనసాగుతాయి. కానీ ప్లాట్స్ అన్నీ ఒకటే అయినా కూడా ప్రతి సిరీస్ లోను, సినిమాలోను చూపించే కథలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే. ఈ సిరీస్ ను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సిరీస్ చూడాలనే ఇంట్రెస్ట్ రావాలంటే కనీసం ఈ మూవీ ఎలా ఉంటుందో.. స్టోరీలైన్ ఏంటో తెలుసుకోవాల్సిందే. రవి శంకర్ త్రిపాఠీ అనే ఓ వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఉద్యోగ రీత్యా అతను ఎప్పుడు తన పై అధికారుల నుంచి తరచూ అవమానాలు ఎదుర్కొంటు ఉంటాడు. అలా అవమానాలు ఎదుర్కోవడం కష్టంగా భావించి.. ఏకంగా తన ఉద్యోగానికి రాజినామ చేయాలని అనుకుంటాడు.సరిగ్గా అదే సమయంలో అతని దగ్గరకు ఓ కేసు వస్తుంది. ఈ కేసులో ఆ అమ్మాయి యాసిడ్ దాడికి గురి అవుతుంది. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు రవి శంకర్. ఈ ప్రయత్నంలో రవి శంకర్ కు ఎదురైన సవాళ్లు ఏంటి ! అసలు ఆమెపై దాడి చేసింది ఎవరు! అతను ఆ కేసును సాల్వ్ చేశాడా ! లేదా రిజైన్ చేశాడా ! అసలు ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే.

ఈ వెబ్ సిరీస్ పేరు “కాలకూట్”. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. పైగా తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ కాకుండా చూసేయండి. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందించారు మేకర్స్ . ప్రతి ఎపిసోడ్ కూడా చివరి వరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా కదలనివ్వకుండా.. చూసేలా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. ఓటీటీ లో ఈ తరహా చిత్రాలు చాలానే ఉన్నాయి కదా అని.. అన్నటిలానే ఇది కూడా అనుకుంటే మాత్రం పొరపడినట్లే. ఎందుకంటే ఈ సిరీస్ వాటి అన్నిటికంటే కూడా చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments