iDreamPost
android-app
ios-app

OTT లోకి సరికొత్త యానిమేటెడ్ మూవీ.. తెలుగు కూడా స్ట్రీమింగ్.. ఎక్కడంటే !

  • Published Jul 17, 2024 | 8:48 PMUpdated Jul 17, 2024 | 8:48 PM

OTT Animated Movie In Telugu: యానిమేటెడ్ మూవీస్ అంటే చిన్న పిల్లలకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అని లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరొక యానిమేటెడ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది.

OTT Animated Movie In Telugu: యానిమేటెడ్ మూవీస్ అంటే చిన్న పిల్లలకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అని లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరొక యానిమేటెడ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది.

  • Published Jul 17, 2024 | 8:48 PMUpdated Jul 17, 2024 | 8:48 PM
OTT లోకి సరికొత్త యానిమేటెడ్ మూవీ.. తెలుగు కూడా స్ట్రీమింగ్.. ఎక్కడంటే !

90’s కిడ్స్ కు యానిమేటెడ్ సినిమాలకు ఓ స్పెషల్ బాండ్ ఉంటుంది. ఆ సమయంలో టీవీ లలో వచ్చే కార్టూన్ సినిమాలను ఎంత బాగా ఆదరించేవారో.. అలానే ఈ మధ్య వస్తున్న యానిమేటెడ్ మూవీస్ ను కూడా అదే రేంజ్ లో ఆదరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి యానిమేటెడ్ సినిమాలకు.. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు.. ఈ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయినా కల్కి మూవీకి సంబంధించిన.. బుజ్జి&భైరవ సిరీస్ కూడా యానిమేటెడ్ వెర్షన్ లోనే రిలీజ్ అయింది. సో ప్రస్తుతం యానిమేటెడ్ మూవీస్ కు కూడా బాగానే డిమాండ్ ఉంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ యానిమేటెడ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ యానిమేటెడ్ మూవీ మరేదో కాదు.. కుంగ్ ఫు పాండా 4.. ఈ సినిమా మార్చి15 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాను డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. కుంగ్ ఫు పాండా 3 అనుకోని విజయం సాధించడంతో.. ఆ తర్వాత దానికి కంటిన్యుషన్ గా కుంగ్ ఫు పాండా 4 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఇక ఈ సినిమా థియేటర్ లో డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీ లో చూడడం కోసం ఎంతో మంది యానిమేషన్ మూవీ లవర్స్ ఎదురుచూసారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా ఈ సినిమా తెలుగు , హిందీ , ఇంగ్లీష్ , బెంగాలీ , మరాఠీ , కన్నడ , తమిళ వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

ఎలాగూ జియో సినిమాలో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తక్కువే .. అందరికి అందుబాటులోనే ఉండే ధరలే కాబట్టి.. అందరు ఈ సినిమాను చూసేయొచ్చు. సో యానిమేటెడ్ మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఇక ఈ సినిమానే కాకుండా జియో సినిమా ప్లాట్ ఫార్మ్ ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలను.. ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఓటీటీ లలో ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేదు. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు.. ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్న.. కుంగ్ ఫు పాండా 4 మూవీని కూడా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. హాట్ స్టార్ లో ఈ టాప్ 5 యానిమేటెడ్ మూవీస్ ఎలా మిస్ అయ్యారు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి