iDreamPost
android-app
ios-app

OTTలో కీచక టీచర్.. చదువు చెప్పమంటే.. అమ్మాయికి ప్రేమ పాఠాలు!

  • Published Jun 06, 2024 | 4:56 PM Updated Updated Jun 06, 2024 | 4:56 PM

OTT Movie Suggestions- Nawazuddin Best Movie: నవాజుద్దీన్ సిద్ధికీ గురించి పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ నెగిటివ్ రోల్ మాత్రం నవాజుద్దీన్ లైఫ్ లో మంచి పేరు తెచ్చింది.

OTT Movie Suggestions- Nawazuddin Best Movie: నవాజుద్దీన్ సిద్ధికీ గురించి పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ నెగిటివ్ రోల్ మాత్రం నవాజుద్దీన్ లైఫ్ లో మంచి పేరు తెచ్చింది.

  • Published Jun 06, 2024 | 4:56 PMUpdated Jun 06, 2024 | 4:56 PM
OTTలో కీచక టీచర్.. చదువు చెప్పమంటే.. అమ్మాయికి ప్రేమ పాఠాలు!

నవాజుద్దిన్ సిద్ధికీ.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న అరుదైన విలక్షణ నటుల్లో ఈయన కూడా ఒకడు. నవాజుద్దీన్ సిద్ధికీ చేసిన ఎన్నో పాత్రలు అభిమానుల నుంచి మన్ననలు పొందాయి. ఈయన చేయని పాత్రల లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి వేరియషన్ ను పలికించగల సమర్థుడు. అందుకే ఎలాంటి పాత్రను అయినా ఎంతో అవలీలగా చేసేస్తాడు. అయితే నవాజుద్దీన్ చేసిన పాత్రల్లో నెగిటివ్ రోల్స్ లోనే ఎక్కువ చేశాడు. నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలను ఎంతో బాగా చేయగలడు. ఈ మూవీలో కూడా నవాజుద్దీన్ ఒక కీచక పటీచర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో నవాజుద్దీన్ ని చూస్తే మీకు రక్తం ఉడికిపోతుంది.

నవాజుద్దీన్ సిద్ధికీ ఈ సినిమాలో ఒక టీచర్ గా చేశాడు. మామూలు టీచర్ కాందడోయ్.. ఒక కీచక టీచర్ గా చేశాడు. చేయడం మాత్రమే కాదు.. తన నటనతో మీ కోపాన్ని కట్టలు తెగేలా చేస్తాడు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇంత బాగా ఎలా చేయగలడు అనిపిస్తుంది. ఒక మారుమూల పల్లెటూరిలో ఒక చిన్న స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఒక మంచి టీచర్ అనే బిరుదును సొంతం చేసుకుంటాడు. ఆయనకు పెళ్లి కూడా అవుతుంది. అలాగే ఒక కొడుకు కూడా ఉంటాడు. కానీ, అతని బుద్ధి మాత్రం పెడదోవ పడుతుంది. స్కూల్లో పాఠాలు చెప్పమంటే పాఠశాలకు వచ్చే అమ్మాయికి ప్రేమ పాఠాలు చెప్తూ ఉంటాడు.

Nawazuddin

ఏమీ తెలియని వయసులో ఆ అమ్మాయికి ప్రేమ అనే మందు పోస్తాడు. అమ్మాయేమో.. పంతులుతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆ టీచర్ తోనే తన భవిష్యత్ ని కూడా ఊహించుకుంటుంది. ఆ టీచర్ కోసం కుటుంబాన్ని వదిలేసి పారిపోవాలి అని కూడా అనుకుంటుంది. కానీ, కొన్నిసార్లు ప్రయత్నించినా అది వర్కౌట్ కాదు. అంతేకాకుండా అమ్మాయి తండ్రి ఒక పోలీస్. ఈ విషయాలు, ఆ టీచర్ వ్యవహారం ఏమీ ఆయనకు తెలియవు. మరోవైపు భార్యను కూడా ఈ కీచక టీచర్ బాగానే మోసం చేస్తూ ఉంటాడు. కానీ, ఒకసారి అసలు విషయం తెలుస్తుంది. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అయిపోతుంది.

ఊరిలో మంచి పేరు తెచ్చుకున్న ఆ పంతులు ఆ పేరును కాపాడుకోవాలి అని తాపత్రయ పడుతూ ఉంటాడు. అతని ఆగడాలు అసలు బయట పడ్డాయా లేదా? ఆ కీచక టీచర్ చరలో చిక్కుకున్న ఆ అమ్మాయి బయట పడిందా? భర్త చేస్తున్న వెర్రి పనులను ఆ భార్య ఎలా ఖండించింది? అనే పాయింట్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తాయి. ఈ మూవీ మరేదో కాదు.. ‘హరామ్ ఖోర్‘. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ గనుక మీరు ఇప్పటికే చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss