OTT Suggestions-Best Crime Drama : OTTలో నయనతార బెస్ట్ క్రైమ్ డ్రామా.. లేడీ సూపర్ స్టార్ విశ్వరూపం

OTTలో నయనతార బెస్ట్ క్రైమ్ డ్రామా.. లేడీ సూపర్ స్టార్ విశ్వరూపం

OTT Best Crime Drama : ఓటీటీ లో వారం వారం వచ్చే సినిమాలే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

OTT Best Crime Drama : ఓటీటీ లో వారం వారం వచ్చే సినిమాలే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఇప్పుడు ఎలాగూ తెలుగు తమిళం అనే తేడా లేకుండా.. అన్ని భాషల చిత్రాలను కూడా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూ వస్తున్నారు. ఓటీటీ ల హావ పెరిగిపోయిన దగ్గర నుంచి అయితే.. ఇలాంటి సినిమాలకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. దీనితో మేకర్స్ కూడా ఇప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలే కాకుండా.. ఆల్రెడీ ఓటీటీ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీటిలో ఓ మంచి క్రైమ్ డ్రామా గురించి సెర్చ్ చేస్తుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “కో కో కోకిల“. ఇదొక తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఇక తమిళ సినిమాలు ఇలాంటి జోనర్స్ మూవీస్ ను డిఫరెంట్ గా చూపించడంలో ఎప్పుడు ముందుటాయి. ఈ సినిమా కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సినిమానే. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. తెలుగు నాట నయనతారకు మంచి క్రేజ్ ఉంది. అలాగే ఈ అమ్మడు తెలుగుతో పాటు..ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఉంటుంది. ఇక నయనతార గ్లామరస్ పాత్రలతో పాటు.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు కూడా తనకు సెట్ అయ్యే ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమానే. ఈ ప్రయోగాత్మక చిత్రం థియేటర్ లో విడుదల అయినప్పుడు.. తమిళ నాట కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో కోకిల క్యారెక్టర్ లో నయనతార నటించింది. ఈ సినిమా అంత కూడా మధ్యతరగతి యువతి అయినా కోకిల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. అయితే ఆమె తల్లి అప్పటికే లంగ్ క్యాన్సర్ బారిన పడి ఉంటుంది. ఆమెను కాపాడడానికి కనీసం రూ.15 లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దానికోసం ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు దొరకదు . ఆఖరికి బంధువులు , స్వచ్ఛంద సంస్థలు కూడా ఏ సహాయం చేయవు. అయితే సరిగ్గా అదే సమయంలో.. ఆమె ఓ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ అవుతుంది. దీనితో కొన్ని తప్పని సరి పరిస్థితుల్లో.. డబ్బు కోసం కోకిల కూడా స్మగ్లింగ్ మొదలుపెడుతుంది. చివరికి ఆ డ్రగ్స్ ముఠాకె ఆమె టార్గెట్ అవుతుంది. ఆమె కుటుంబం మొత్తాన్ని.. ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. అలాంటి పరిస్థితి నుంచి ఆమె ఎలా తప్పించుకుంది ? ఆ తర్వాత ఏం జరిగింది ? స్మగ్లింగ్ వ్యాపారం నుంచి ఆమె బయటపడిందా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. తాప్సి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేసిందా! OTTలో ఈ మూవీలో ట్విస్టులే ట్విస్టులు

Show comments