iDreamPost
android-app
ios-app

తాప్సి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేసిందా! OTTలో ఈ మూవీలో ట్విస్టులే ట్విస్టులు

  • Published Jul 13, 2024 | 4:00 AM Updated Updated Jul 15, 2024 | 12:42 PM

OTT Best Suspense Thriller : సస్పెన్స్ డ్రామాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఈ సినిమాను ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఓ మంచి మూవీని మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller : సస్పెన్స్ డ్రామాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఈ సినిమాను ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఓ మంచి మూవీని మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 13, 2024 | 4:00 AMUpdated Jul 15, 2024 | 12:42 PM
తాప్సి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేసిందా!  OTTలో ఈ మూవీలో ట్విస్టులే ట్విస్టులు

ఓటీటీ లో ఇప్పటికే చాలా సినిమాలు.. వాటిలో ఒక్కో జోనర్ కు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటూ ఉంటారు. కొంతమంది హర్రర్ సినిమాలంటే ఇష్టమైతే.. మరి కొంతమందికి సస్పెన్స్ డ్రామాస్ అంటే ఇష్టం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.. సస్పెన్స్ డ్రామాస్ అంటే ఇష్టం ఉంటే మాత్రం ఈ సినిమాను ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకవేళ చూడలేదంటే ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ అయినట్లే. పైగా దీనిలో కాస్తంత హర్రర్ టచ్ ను కూడా చూపించారు మేకర్స్. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “బ్లర్” . ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ తాప్సి. తెలుగులో ఆఫర్లు తగ్గిన తర్వాత ఈ అమ్మడు బి టౌన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలు రకాల సినిమాలు చేస్తూ.. మంచి టాక్ నే సంపాదించుకుంది ఈ బ్యూటి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాకైతే.. స్వయంగా తానే నిర్మాతగా కూడా వ్యవహరించారు. హిందీ లో తాప్సి ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కథలను ఎంచుకుని.. ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఓ ప్రయత్నమే బ్లర్ మూవీ. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఈ సినిమా ఏంటి.. ఎందుకు చూడాలి. ఈ సినిమా కథేంటి అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో తాప్సి ఓ అంధురాలు. ఆమె ఒంటరిగా ఉంటూ ఉంటుంది. అనుకోకుండా ఓ రోజు ఆమె అదే ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపిస్తుంది. అది కాస్త పోలీస్ కేసు అవుతుంది. ఇక విచారణలో అది ఆత్మహత్యగా నిర్దారిస్తారు పోలీసులు. అయితే తాప్సి కి ఓ ట్విన్ సిస్టర్ కూడా ఉంటుంది. ఆమె పేరు గాయత్రీ. వాళ్ళ అక్క ఆత్మహత్య చేసుకోలేదని.. తనని ఎవరో హత్య చేశారని ఆమె చెప్తుంది. కానీ ఆ విషయాన్నీ ఎవరు నమ్మరు. అది ఆత్మహత్య అని కొట్టి పడేస్తారు. దీనితో ఇంకా గాయత్రి ఊరుకోకుండా.. తన అక్కకు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. స్వయంగా ఆమె ఈ విషయాన్ని డీల్ చేయడానికి రంగంలోకి దిగుతుంది. అప్పటినుంచి కూడా ఆమెను ఎవరో నీడలా ఫాలో అవుతూనే ఉంటారు. అసలు ఆమెను ఫాలో అయ్యేది ఎవరు ? ఆమె ఏదైనా ప్రమాదంలో పడుతుందా ? తన అక్కది ఆత్మహత్య కాదని హత్య అని ఆమె ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తుంది ? అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఇది కూడా చూడండి.. భవిష్యత్ కోసం యువతి ఒంటరి పోరాటం.. OTTలో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş