OTT Suggestion- Best Sci-Fi Movie : ఒక్క రోజు టెక్నాలజీ పని చేయకపోతే విధ్వంసం .. OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ

ఒక్క రోజు టెక్నాలజీ పని చేయకపోతే విధ్వంసం .. OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ

OTT Best Sci-Fi Movie : ఇప్పుడు అంతా టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు. ఒక్క రోజు కూడా మొబైల్ లేకుండా జీవించలేని పరిస్థితులు వచ్చేశాయి. మరి అలాంటిది. ఇవేమి లేకుండా మనిషి బ్రతకగలడా! ఇలాంటి ఓ సినిమా గురించి చూసేద్దాం.

OTT Best Sci-Fi Movie : ఇప్పుడు అంతా టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు. ఒక్క రోజు కూడా మొబైల్ లేకుండా జీవించలేని పరిస్థితులు వచ్చేశాయి. మరి అలాంటిది. ఇవేమి లేకుండా మనిషి బ్రతకగలడా! ఇలాంటి ఓ సినిమా గురించి చూసేద్దాం.

ఓటీటీ లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఉన్న అన్ని మూవీస్ చూసేసినా కానీ ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజెప్పే సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు.. అసలు మూవీస్ పైనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రప్పిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు.. టెక్నాలజీకి , మొబైల్ ఫోన్స్ కు, ఇంట్లో ఉంటున్న విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. మరి అలాంటిది ఇవేమి లేకుండా మనుషులు జీవించాల్సిన పరిస్థితి వస్తే.. వాటిని ఎలా డీల్ చేస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విల్ , సమంత అనే ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉంటారు. ఈ క్రమంలో సమంత ప్రెగ్నెంట్ అవుతుంది. దీనితో విల్ సమంత వాళ్ళ ఇంటికి పెళ్లి గురించి మాట్లాడానికి వెళ్తాడు. అయితే అక్కడ సమంత తండ్రితో విల్ కు గొడవ అవుతుంది. దీనితో అసలు సామ్ ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పకుండానే అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు సామ్ విల్ కు కాల్ చేస్తుంది. సరిగ్గా వారిద్దరూ కాల్ మాట్లాడుకునే సమయంలో ఓ వింత శబ్దం వినిపిస్తుంది. వెంటనే లైన్ కట్ అయిపోతుంది. అలాగే భూకంప హెచ్చరికలు జారీ చేయడం వలన విల్ వెళ్లే విమానం కూడా రద్దు అయిపోతుంది. అన్ని చోట్ల కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. దీనితో అతను తిరిగి సామ్ ఫ్యాన్స్ దగ్గరకు వస్తాడు. అయితే అప్పటికి సామ్ ఎక్కడికో పారిపోతుంది. దీనితో విల్ , సామ్ తండ్రి కలిసి ఆమెను వెతకడానికి బయల్దేరతారు.

అయితే దారిలో భారీ ట్రాఫిక్ కారణంగా సైనికులు రాకపోకలు నిలిపివేస్తారు. అయినా సరే పెర్మిషన్ తీసుకుని వెళ్తారు. కానీ దారిలో ఓ పోలీస్ కార్ వీళ్ళను ఆపేస్తుంది. కాలం ఆ కార్ లో ఉన్నది పోలీసులు కాదు. పారిపోతున్న ఓ ఖైదీ,అయితే వాళ్ళ మధ్యన గన్ ఫైట్ జరుగుతుంది. వారి మధ్యన భారీ యుద్ధమే జరుగుతుంది. దీనితో అక్కడ వారి కార్స్ కూడా పాడైపోతాయి. అక్కడే ఓ మెకానిక్ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ కార్ ను బాగు చేస్తుంది. మళ్ళీ దారిలో కార్ పాడైతే కష్టమని చెప్పి..ఆమెను కూడా వాళ్ళతో తీసుకుని వెళ్తారు. అయితే మళ్ళీ దారిలో పెట్రోల్ కోసం ఆపి ఫైట్ చేసే వారు వస్తారు. ఈసారి విల్ వాళ్ళను కాల్చి చంపేస్తాడు. దీనితో ఆ మెకానిక్ వాళ్లకు భయపడి వెళ్ళిపోతుంది. అలా చిన్న చిన్న వాటికి చాలా మందిని చంపేసిన తర్వాత.. విల్ తన భార్య సామ్ ను కలుస్తాడు. అక్కడి నుంచి కథ చాలా మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఎందుకు చిన్న చిన్న వస్తువులు కోసం చంపుకుంటూ ఉంటారు? ఆ దేశంలో ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే.. “హౌ ఇట్ ఎండ్స్” అనే ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ ఎవరు చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది కూడా చూడండి.. అందంగా కనిపిస్తూ ప్రాణాలు తీసే రోబో.. OTT లో వెరైటీ మూవీ

Show comments