Swetha
OTT Best Horror Thriller: హర్రర్ మూవీస్ మూవీ లవర్స్ కు చూసే తీరక ఉండాలే కానీ ఓటీటీ లో లెక్కలేనన్ని హర్రర్ మూవీస్ ఉన్నాయి. అయితే అన్ని సినిమాలను సబ్స్క్రిప్షన్ తోనే కాకుండా.. కొన్ని సినిమాలను ఫ్రీ గా కూడా చూసేయొచ్చు. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి.
OTT Best Horror Thriller: హర్రర్ మూవీస్ మూవీ లవర్స్ కు చూసే తీరక ఉండాలే కానీ ఓటీటీ లో లెక్కలేనన్ని హర్రర్ మూవీస్ ఉన్నాయి. అయితే అన్ని సినిమాలను సబ్స్క్రిప్షన్ తోనే కాకుండా.. కొన్ని సినిమాలను ఫ్రీ గా కూడా చూసేయొచ్చు. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి.
Swetha
ప్రతి వారం ఓటీటీ లో ఎదో ఒక హర్రర్ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని సినిమాలను మిస్ అయిపోతున్నారు. అలాగే అన్ని సినిమాలను సబ్స్క్రిప్షన్ తోనే చూడాలంటే మూవీ లవర్స్ కు కాస్త కష్టం అవుతుంది. కాబట్టి వీటిలో కొన్ని సినిమాలను ఫ్రీ గా కూడా చూసేయొచ్చు. ఇప్పడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే . దాదాపు హర్రర్ మూవీస్ అన్నీ కూడా దెయ్యం మనుషులను భయపెట్టడం అనే ప్లాట్ తోనే కొనసాగుతు ఉంటాయి. ప్రేక్షకుల ఫోకస్ అంతా కూడా సినిమా అయ్యేంత వరకు.. ఆ సీన్స్ వారిని థ్రిల్ చేశాయా లేదా అనే దానిపైనే ఉంటుంది. దానిలో ఈ సినిమా ముందుంటుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో ఎవరో స్మశానంలో డెడ్ బాడీని బయటకు తీస్తూ కనిపిస్తారు. అదే టైమ్ లో ఒక ఇంట్లో ఉన్న చిన్న పాపను చూపిస్తారు. ఇంట్లో ఎదో సౌండ్ వస్తుందని ఆమె బయటకు వచ్చి చూస్తే .. అక్కడ ఎదో దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ దెయ్యం వాళ్ళ అమ్మను చంపేస్తుంది. దీనితో ఆ పాప భయపడి కప్ బోర్డులో దాక్కుంటుంది. కట్ చేస్తే స్టోరీని 20 ఏళ్ళ తర్వాత చూపిస్తారు. వాళ్ళ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి భయపడిన ప్రతి సారి ఆ కప్ బోర్డులోనే దాక్కుంటుంది. దీనితో కూతురు ఇలా భయపడడంతో వాళ్ళ నాన్న తనను హాస్టల్ వేద్దాం అనుకుంటాడు. కానీ ఆమె నేను ఎక్కడికి వెళ్లినా ఆ దెయ్యం నాతోనే వస్తుంది. కాబట్టి నన్ను ఒంటరిగా వదిలేయొద్దని చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న అవేం పట్టించుకోకుండా ఆమెను హాస్టల్ కు తీసుకుని వెళ్తాడు.
కట్ చేస్తే అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి కూడా ఆమెకు వింత సంఘటనలు ఎదురౌతాయి. ఆమెకు రకరకాల సౌండ్స్ వినిపిస్తాయి. అలాగే ఆమెకు మాత్రమే కనిపించే దెయ్యం.. ఆమెపై ఎటాక్ చేయడానికి ట్రై చేస్తే.. దాని నుంచి తప్పించుకుంటుంది. ఇక ఆ నెక్స్ట్ డే మామూలుగానే స్కూల్ కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన రూమ్ కు ఒక కొత్త అమ్మాయి వస్తుంది. కానీ ఆమె హీరోయిన్ తో ఏమి మాట్లాడదు. ఓ రోజు హీరోయిన్ బయట నడుస్తూ ఉన్నపుడు.. ఆమెకు దూరంగా ఎదో కనిపిస్తుంది. కానీ ఆమె వెనుక దెయ్యం వెళ్లడం గమనించదు. కట్ చేస్తే ఆమెకు ఓ రోజు తన ఫ్రెండ్ చనిపోయినట్లు కల వస్తుంది. ఆ తర్వాత రోజు అది నిజంగానే జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఆమెకు మాత్రమే ఎందుకు దెయ్యం కనిపిస్తుంది? స్టార్టింగ్ లో స్మశానంలో డెడ్ బాడీస్ ను బయటకు తీసింది ఎవరు ? చివరికి ఏం జరిగింది ? వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది? ఇవన్నీ తెలియాలంటే “బిసికన్ ఇబ్లీస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.