iDreamPost
android-app
ios-app

ఒకే ఫ్యామిలీలో వరుస హత్యలు- కిడ్నాపులు.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

  • Published Jun 18, 2024 | 6:06 PM Updated Updated Jun 18, 2024 | 6:06 PM

OTT Movie Suggestions- Best Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలామంది మంచి థ్రిల్లర్స్, హారర్ మూవీస్ కి అలవాటు పడ్డారు. అయితే మీకోసం ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాం. ఇందులో ట్విస్టులకు పిచ్చెక్కిపోతారు.

OTT Movie Suggestions- Best Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలామంది మంచి థ్రిల్లర్స్, హారర్ మూవీస్ కి అలవాటు పడ్డారు. అయితే మీకోసం ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాం. ఇందులో ట్విస్టులకు పిచ్చెక్కిపోతారు.

  • Published Jun 18, 2024 | 6:06 PMUpdated Jun 18, 2024 | 6:06 PM
ఒకే ఫ్యామిలీలో వరుస హత్యలు- కిడ్నాపులు.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

కొన్నిసార్లు ఒక బెస్ట్ థ్రిల్లర్ చూడాలి అనిపిస్తుంది. కానీ, సరైన సమయానికి సరైన స్టోరీతో ఒక థ్రిల్లర్ మన కంట పడదు. కానీ, ఓటీటీలో చాలానే బెస్ట్ థ్రిల్లర్ మూవీస్, మిస్టరీ థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, చాలా మంది ఆ మూవీస్ ని మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పుకునే మూవీ కూడా ఒక మంచి థ్రిల్లర్ స్టోరీ. కానీ, ఇందులో బిగ్ స్టార్ కాస్ట్ లేదని అంతా లైట్ తీసుకున్నారు. తెలుగు మూవీ.. అందులోనూ ఓటీటీలు అందుబాటులో ఉన్న మూవీ. అందుకే మీకోసం ఓటీటీ సజీషన్ కింద ఆ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇందులో వచ్చే ట్విస్టులకు పిచ్చెక్కిపోవడం పక్కా.

సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో వచ్చేవే సినిమాలు కాదు.. చిన్న చిన్న మూవీస్లో కూడా అద్భుతాలు ఉంటాయి అని మీకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇందులో చాలా మంచి కథ ఉంటుంది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ, చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ మాత్రం లేదు. అంతేకాకుండా.. ఇందులో కొంత మంది యాక్టింగ్ మీకు కాస్త ఇరిటేటింగ్ కూడా అనిపిస్తుంది. కాకపోతే అవన్నీ పట్టుకుని మూవీ వదిలేస్తే మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీని మీరు మిస్ అయిన వాళ్లు అవుతారు. అంతేకాకుండా ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ఒక్కో దానికి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఒకే కుటుంబంలో అసలు వరుస హత్యలు జరగడం ఏంటి? ఒకే కుటుంబంలో ఉన్న వాళ్లు కిడ్నాప్ కావడం ఏంటి అనేది మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్.

Love Clue

ఈ సినిమాలో మీకు మొత్తం కథ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక సీఐ అయి ఉండి కూడా ఈ కేసును సాల్వ్ చేయలేక నానా ఇబ్బందులు పడతాడు. అంతేకాకుండా కాసేపటికి ఒక టర్న్ తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఒక కిడ్నాప్ కేసుతో మొదలై ఆ తర్వాత మరిన్ని కిడ్నాపులు, హత్యల వరకు వెళ్తుంది. ఇంకొక ట్విస్టు ఏంటంటే.. ఇందులో అపహరణకు గురైన మహిళ ఎవరు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారుతుంది. కిడ్నాప్ అయ్యింది ఒకరు అయితే.. మరో మహిళ కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. అలా వారిని కూడా తప్పుదోవ పట్టిస్తారు. మొత్తానికి ఇది ఒక మంచి మిస్టరీ మాత్రమే కాదు.. మంచి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కూడా . ఈ సినిమాలో యాక్టర్స్, వారి యాక్టింగ్ గురించి లైట్ తీసుకుని.. కథను నమ్మి మూవీ చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా పేరు “క్లూ: ఏ లవ్ థ్రిల్లర్”. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది ఇంకా చూడకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet