iDreamPost
android-app
ios-app

ఒకరిది పేదరికం.. ఒకరిది డబ్బుందన్న అహం.. OTTలో బెస్ట్ చీటింగ్ మూవీ!

  • Published Jun 18, 2024 | 7:20 PM Updated Updated Jun 18, 2024 | 7:20 PM

OTT Movie Suggestions- Best Action Drama: మీరు ఒక మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకోసమే ఈ సినిమా. ఇందులో క్యారెక్టర్స్ ఏం చేస్తే మీరు కూడా అదే ఫీలవుతారు. వారికి బాగా కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి చేతులారా జీవితం నాశనం చేసుకుంటుందే అని బాధ పడతారు.

OTT Movie Suggestions- Best Action Drama: మీరు ఒక మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకోసమే ఈ సినిమా. ఇందులో క్యారెక్టర్స్ ఏం చేస్తే మీరు కూడా అదే ఫీలవుతారు. వారికి బాగా కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి చేతులారా జీవితం నాశనం చేసుకుంటుందే అని బాధ పడతారు.

  • Published Jun 18, 2024 | 7:20 PMUpdated Jun 18, 2024 | 7:20 PM
ఒకరిది పేదరికం.. ఒకరిది డబ్బుందన్న అహం.. OTTలో బెస్ట్ చీటింగ్ మూవీ!

కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఓకేలే అనిపిస్తాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం చూసిన తర్వాత వావ్ అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు మాత్రం చూసిన తర్వాత మన మనసుకు హత్తుకుంటాయి. ఈ మూవీ కూడా అలాంటిదే. ఈ సినిమాలో మీరు ఎంతలా ఇన్వాల్వ్ అవుతారు అంటే.. వాళ్లు ఏడిస్తే మీరు కూడా ఏడుస్తారు. ఒక ఇద్దరు తెలివైన పిల్లల కథే ఇది. చదువుకు, తెలివికి పేదరింక అడ్డు కాదు అని నిరూపించిన ఇద్దరు పిల్లల కథ. కానీ, డబ్బుంది అన్న అహం.. ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది. వారికి అసలు భవిష్యత్తే లేకుండా చేస్తుంది. అసలు ఆ మూవీ ఏది? అందులో అంత అద్భుతమైన కథ ఏముందో చూద్దాం.

ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ధనికులు ఉంటారు. పేదవాళ్లు ఉంటారు. కటిక పేదరికంలో కూడా గొప్ప కలలు కనే పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లల ఆశలను చిధిమేసే కొందరు ధనిక వర్గానికి చెందిన పిల్లు కూడా ఉంటారు. డబ్బుంటే చాలు.. మనం ఏదైనా సాధించవచ్చు.. ఎవరి జీవితాలతోనైనా ఆడుకోవచ్చు అనేది ఆ రిచ్ కిడ్స్ నైజం. ఆ రిచ్ కిడ్స్ అంతా చదువుతూ ఉండే కాలేజ్ లో ఇద్దపు పేద పిల్లలు జాయిన్ అవుతారు. వారి మెరిట్ కారణంగా వారికి అక్కడ ఉచితంగా చదువుకునే అవకాశం దక్కుతుంది. అయితే వెళ్లిన రోజు నుంచి వారిని మిగిలిన పిల్లలు అంతా ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. అలాగే వారికి ఏమీ లేదు అనే పాయింట్ ని బాగా ఎత్తిచూపిస్తారు.

అక్కడితో ఈ కథ ఆగదు. ఆ రిచ్ కిడ్స్ లో ఒక అమ్మాయి.. ఈ పేద పిల్లకు వల వేస్తుంది. డబ్బు, కాస్ట్లీ ఫోన్లు, మంచి మంచి బట్టలు వంటివి అన్నీ ఆశ చూపుతుంది. అలా ఎగ్జామ్స్ లో తాను మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేసేందుకు హెల్ప్ తీసుకుంటుంది. మరో కుర్రాడు చెబుతూనే ఉంటాడు.. ఇవన్నీ మనకు వర్కౌట్ కావు అని. కానీ, ఆ అమ్మాయి మాత్రం వారి ట్రాప్ లో పడిపోతుంది. చిన్నగా తనకు తెలియకుండానే తాను ఆ రిచ్ కిడ్స్ ఊబిలో చిక్కుకుంటుంది. వారు ఈ అమ్మాయి జీవితంతోనే ఆడుకుంటారు. పెద్ద ప్లాన్ వేసి ఆ పేదపిల్ల మోసం చేస్తోంది అని అందరికీ తెలిసేలా చేస్తారు. తాను చీటింగ్ చేస్తోంది అంటూ బయట పెడతారు.

ఆ అమ్మాయి మీద తన కుటుంబం పెట్టుకున్న ఆశలు మొత్తం నీరుగారి పోతాయి. ఆ అమ్మాయి మీద చీటింగ్ కేసు కూడా పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఏం చేసింది? అసలు ఆ రిచ్ కిడ్స్ వీళ్ల జీవితాలతో ఎలా ఆడుకున్నారు? పేదరికం- రిచ్ కిడ్స్ మధ్య పోరులో ఎవరు గెలిచారు? అసలు ఆ ఇద్దరూ వారి చదువును పూర్తి చేశారా? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమా పేరు ‘ఫర్రే’. అంటే ఎగ్జామ్ లో వాడే స్పిప్పులు అనమాట. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio