OTT Comedy Movie : OTT లోకి రీసెంట్ క్రేజీ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

OTT Comedy Movie : OTT లోకి రీసెంట్ క్రేజీ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఓటీటీలో కామెడీ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా కామెడీ హర్రర్ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీలో కామెడీ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా కామెడీ హర్రర్ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం ఓటీట్ లో కామెడీ సినిమాల హావ నడుస్తోందని చెప్పొచ్చు. కనీసం వారానికి రెండు కామెడీ మూవీస్ అయినా రిలీజ్ అవుతున్నాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు కామెడీ మూవీస్ కు ఎలాంటి క్రేజ్ పెరుగుతుందో. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ రాబోతుంది. అసలే ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని ఎదురుచూసే ప్రేక్షకులకు ఇదొక మంచి న్యూస్. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ .. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా మరేదో కాదు.. నందితా శ్వేతా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన.. “ఓ మంచి ఘోస్ట్”. ఈ సినిమా జూన్ 21 న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా రిలీజ్ కు ముందు ఉన్నంత క్రేజ్ రిలీజ్ తర్వాత మాత్రం లేదు. రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాగా ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో పాటు.. ష‌క‌ల‌క శంక‌ర్‌, న‌వ‌మి గాయ‌క్‌, ర‌ఘుబాబు, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా కొనుగోలు చేయగా.. ఆగష్టు మొదటి వారం లేదా రెండో వారంలో రిలీజ్ కానుందని సమాచారం.. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో డబ్బుల కోసం కొంతమంది గ్యాంగ్ అంతా కలిసి.. ఆ ఊరి ఎమ్మెల్యే కూతురిని కిడ్నప్ చేస్తారు. అయితే వారు ఆ అమ్మాయిని కిడ్నప్ చేయడానికి అంటే ముందే.. ఆమెను ఓ దెయ్యం ఆత్మ ఆవహించి ఉంటుంది. ఇక ఆ నలుగురు.. ఆ అమ్మాయిని ఊరి బయట ఉన్న మహల్ లో దాచిపెడతారు. ఈ క్రమంలో ఆమె ఈ నలుగురిని చంపడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆ నలుగురు ఆ దెయ్యం నుంచి తప్పించుకున్నారా లేదా ! ఆ తర్వాత ఏమైంది ? ఆమెను దెయ్యం ఎందుకు ఆవహించింది ? ఆ మహల్ కు ఏదైనా చరిత్ర ఉందా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments