Netflix Comedy Web Series: Netflix లోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

Netflix లోకి మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

Netflix Comedy Web Series: ఇప్పుడు కామెడీ మూవీస్ కూడా క్రేజ్ బాగానే పెరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది . మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

Netflix Comedy Web Series: ఇప్పుడు కామెడీ మూవీస్ కూడా క్రేజ్ బాగానే పెరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది . మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆ జోనర్ ఈ జోనర్ అని లేకుండా ఓటీటీ లోకి వచ్చిన ప్రతి సినిమాను, సిరీస్ ను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా జాగ్రత్తగా .. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కు తగినట్లుగానే.. ప్రతి వారం కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇక ఇప్పుడు సస్పెన్స్ , హర్రర్ సినిమాలను ఎంత క్రేజ్ ఉందో.. సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే కామెడీ మూవీస్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. మరి ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్స్ ను పెంచుకునే దిశగా.. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. క్రైమ్ , హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో పాటు.. ఎన్నో జోనర్స్ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచేస్తుంది. అసలే ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి రాబోయే సిరీస్ పేరు “త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్” . ఇక ఈ వెబ్ సిరీస్ జులై 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. స్వయంగా నెట్ ఫ్లిక్స్.. “మీ జీవితంలో అయినా, అకౌంట్లలో అయినా అసమతుల్యత ఉంటే ఈ సీఏ టార్ సర్వీసులు తీసుకోండి. అది మీ రిస్క్ పైనే. ఎందుకంటే ఇతని డబుల్ జీవితం డబుల్ ట్రబుల్ తో పాటు వచ్చింది. త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ నెట్‌ఫ్లిక్స్ లో జులై 18న రాబోతోంది” అంటూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ గురించి అనౌన్స్ చేసింది.

ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్.. విషయానికొస్తే.. సాదా సీదాగా జీవితం గడిపే ఓ వ్యక్తి… మిఠాయిలు తయారు చేసే ఓ గ్యాంగ్ బారిన పడతాడు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సిరీస్ కథ. ఇక ఈ సిరీస్ లో మానవ్ కౌల్, తిలోత్తమ షోమ్ , కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేత బసు ప్రసాద్, సుమిత్ గులాటి , నరేష్ గోసెన్ , నైనా సరీన్ , ఫైజల్ మాలిక్ , అశోక్ పాఠక్ లాంటి నటి నటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఇప్పటికే దాదాపు నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లన్నీ కూడా.. బాగానే పాపులర్ అవుతూ వస్తున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ వెబ్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments