iDreamPost
android-app
ios-app

మళ్లీ OTTలోకి వస్తున్న నయతార అన్నపూర్ణి మూవీ.. కానీ చిన్న ట్విస్ట్

  • Published Aug 07, 2024 | 10:48 AM Updated Updated Aug 07, 2024 | 10:48 AM

Annapoorani : స్టార్ హీరోయిన్ నయనతార గతేడాది అన్నపూర్ణి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలసిందే. అయితే ఎన్నో నడుమల మధ్య విడుదలైన అన్నపూర్ణ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ మూవీ విడుదలైన ఏడు నెలల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి రానుంది. కానీ, ఇక్కడ చిన్న ట్వీస్ట్ కూడా ఉంది. అదేమిటంటే..

Annapoorani : స్టార్ హీరోయిన్ నయనతార గతేడాది అన్నపూర్ణి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలసిందే. అయితే ఎన్నో నడుమల మధ్య విడుదలైన అన్నపూర్ణ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ మూవీ విడుదలైన ఏడు నెలల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి రానుంది. కానీ, ఇక్కడ చిన్న ట్వీస్ట్ కూడా ఉంది. అదేమిటంటే..

  • Published Aug 07, 2024 | 10:48 AMUpdated Aug 07, 2024 | 10:48 AM
మళ్లీ OTTలోకి వస్తున్న నయతార అన్నపూర్ణి మూవీ.. కానీ చిన్న ట్విస్ట్

లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమా తర్వాత ఇటీవలే నటించిన చిత్రం ‘అన్నపూర్ణి’. ఇక ఈ చిత్రం నయన్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. ఎందుకంటే.. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ పలువురు అభ్యంతారం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో వివాదాల నడుమ ఈ సినిమా ఎట్టకేకలకు గతేడాది డిసెంబర్ 1న థియేటర్స్ లో విడుదలైంది. కానీ, లో ఆశించిన స్థాయిలో అన్నపూర్ణి సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా రిలీజై నెల రోజులు గడవక ముందే ప్రముఖ డిసెంబర్ 29వ తేదీన ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో అన్నపూర్ణి సినిమా స్ట్రీమింగ్ చేశారు. కానీ, ఓటీటీలో రిలీజై కూడా విపరీతమైన కాంట్రవర్సీకి గురవ్వడంతో.. వెంటనే ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి నయనతార అన్నపూర్ణ మూవీని తొలిగించారు. కాగా, ఇప్పుడు దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ నయన్ అన్నపూర్ణి ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. కానీ, ఇక్కడ చిన్న ట్వీస్ట్ కూడా ఉంది. ఇంతకీ ఏమిటంటే..

స్టార్ హీరోయిన్ నయనతార గతేడాది అన్నపూర్ణి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలసిందే. కాగా, ఈ మూవీని నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించగా.. నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్‌పై జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో నయనతార తో పాటు జై, సత్యరాజ్ , అచ్చుత్ కుమార్ లు కూడా నటించారు.అయితే గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో.. నెల రోజులకే ఓటీటీలో విడుదలైంది. కానీ, అక్కడ కూడా ఈ మూవీ సబ్జెక్ట్ వివాదాస్పదం కావడంతో విశ్వ హిందూ పరిషత్ దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో మూవీని ఓటీటీల్లో నుంచి తొలగించారు. అయితే ఇలా ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకొస్తున్నారు. కాగా, అన్నపూర్ణి మూవీ ఈ శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి అన్నపూర్ణి మూవీని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. అయితే ఈ సినిమా ఇండియాలో కాకుండా కేవలం విదేశాల్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. అయితే ఒక్క ఇండియాలోని తప్ప ప్రపంచవ్యాప్తంగా నయన్ అన్నపూర్ణి సినిమా సింప్లీ సౌత్ ఓటీటీ స్ట్రీమింగ్ కు మరోసారి రానుంది. కాగా, ఈ విషయాన్ని స్వయంగా ఆ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Annapoorani

ఇక అన్నపూర్ణి కథ విషయానికొస్తే.. సమాజంలో చాలామంది చెఫ్ వృత్తిని వంట ప‌ని అంటూ చాలా మంది చుల‌క‌న‌గా చూస్తుంటారు. కానీ, ఐఏఎస్‌, ఐపీఎస్ లాగే చెఫ్ అన్న‌ది కూడా ఓ గౌర‌వ‌ప్ర‌ద‌మైన వృత్తిగా భావిస్తారని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇకపోతే వంట చేయ‌డం కూడా ఓ ఆర్ట్ అని చాటిచెప్పాడు.  అయితే బ్రాహ్మాణ కుటుంబంకు చెందిన ఓ అమ్మాయి (నయనతార) చెఫ్‌గా ఎలా మారింది? ఈ ప్ర‌యాణంలో ఆమె ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్న‌ద‌న్న‌దే అన్న‌పూర్ణి మూవీ క‌థ‌.  బ్రాహ్మ‌ణులు నాన్ వెజ్ వండ‌టం, తిన‌డం అన్న‌ది చాలా సెన్సిటివ్ పాయింట్‌. ఈ అంశమే వివాదమై ఆ సినిమా ఓటీటీల్లో నుంచి వెళ్లిపోవడానికి కారణమైంది.  మరీ, ఇండియాలో కాకుండా మిగతా ఓటీటీలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.