iDreamPost
android-app
ios-app

వీడియో: సింగర్ లా మారిన నవీన్ పొలిశెట్టి.. ఇండియన్ ఐడల్ 3లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

  • Published Aug 25, 2024 | 3:57 PM Updated Updated Aug 25, 2024 | 6:09 PM

Naveen Polishetty Song Performance on Indian Idol 3 Stage: నవీన్ పొలిశెట్టి తనలో ఉన్న మరో టాలెంట్ ని బయట పెట్టాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఒక హిందీ పాట పాడి అందరినీ మెస్మరైజ్ చేశాడు.

Naveen Polishetty Song Performance on Indian Idol 3 Stage: నవీన్ పొలిశెట్టి తనలో ఉన్న మరో టాలెంట్ ని బయట పెట్టాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఒక హిందీ పాట పాడి అందరినీ మెస్మరైజ్ చేశాడు.

  • Published Aug 25, 2024 | 3:57 PMUpdated Aug 25, 2024 | 6:09 PM
వీడియో: సింగర్ లా మారిన నవీన్ పొలిశెట్టి.. ఇండియన్ ఐడల్ 3లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

నవీన్ పొలిశెట్టి.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్ వాళ్లు కూడా.. ఈఈవ్ అనాల్సిందే. పాత్ర ఏదైనా, కథ ఏదైనా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. యాక్టింగే కాదు.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ కి కూడా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆసువుగా అలా అలా పంచులు విసురుతూ ఉంటాడు. అయితే నవీన్ పొలిశెట్టిలో సింగింగ్ టాలెంట్ ఉంది అని ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఆయన ఎక్కడా పాడలేదు కూడా. కానీ, మొదటిసారి ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ మీద తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని బయట పెట్టాడు. అది కూడా ఎంతో కష్టంగా ఉండే ఒక హిందా పాటతో ఆయన ప్రేక్షకులకు పిచ్చెక్కించేశాడు.

నవీన్ పొలిశెట్టి తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చాడు. అయితే ఎట్రీతోనే అందరికీ ఫ్యూజులు ఎగరకొట్టేశాడు. రావడం రావడం ఒక హిందీ పాట ఎత్తుకున్నాడు. ప్రొఫెషనల్ సింగర్స్ లాగా.. ఆ సింగింగ్ కాంపిటీషన్ లో ఒక కంటెస్టెంట్ లాగా మొత్తం పాట పాడేశాడు. అమితాబ్ బచ్చన్ షరాబీ సినిమాలో కిశోర్ కుమార్ పాడిన “ఇంతెహా హోగయీ.. ఇంతెజార్ కీ” అంటూ నవీన్ పాడిన తీరుకు అక్కడున్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. జడ్జెస్ కూడా స్టన్ అయిపోయారు. నవీన్ ఎంత బాగా హిందీలో మాట్లాడతాడో అందరికీ తెలుసు. నిజానికి ఆయన మాట్లాడటం చూస్తే.. నార్త్ వాళ్లు కూడా కనిపెట్టలేరు తెలుగువాడు అంటే. అలాంటిది పాట పాడితే ఇంకా ఏమైనా ఉందా. అందరూ మెస్మరైజ్ కావాల్సిందే.

నవీన్ ఇప్పటివరకు ఎప్పుడూ తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని బయట పెట్టలేదు. కానీ, ఈసారి ఎందుకో అలా ఒక హిందీ పాటను పాడేశాడు. పాడిన తర్వాత అక్కడున్న కంటెస్టెంట్స్ ని కామెంట్ అడిగాడు. అందరూ నవీన్ టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఆ పిచ్చింగ్ ని ఎంతో పర్ఫెక్ట్ గా మెయిన్ టైన్ చేశారు అంటూ చెప్పారు. అలాగే జడ్జెస్ తమన్, సింగర్ కార్తిక్, గీతా మాధురీ అందరూ నవీన్ టాలెంట్ చూసి కాసేపు నోట మాటరాలేదు. సింగర్ కార్తిక్ అయితే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేశాడు.

నవీన్ పొలిశెట్టి గనుక సింగింగ్ ఫీల్డ్ లోకి వస్తే మాకు గట్టి పోటీ అవుతుంది అని గీతా మాధురీ చెప్పుకొచ్చింది. తమన్ కూడా నవీన్ టాలెంట్ చూసి బౌల్డ్ అయిపోయాడు. నవీన్ ఆ తర్వాత ఓట్ రిక్వెస్ట్ అడుగుతూ.. ఫన్నీగా నేనే ఇండియన్ ఐడల్ సీజన్ 3కి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ హిస్టరీలో హిందీ పాట పాడిన మొదటి వ్యక్తి కూడా నవీన్ పొలిశెట్టి అని హోస్ట్ సింగర్ శ్రీరామచంద్ర ప్రశంసించాడు. మరి.. నవీన్ సింగింగ్ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Naveen Polishetty (@naveen.polishetty)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş