ఈ వారం OTT లో ఈ 3 వెబ్ సిరీస్ లు చాలా స్పెషల్.. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా

This Week Must Watch Web Series In OTT: ఓటీటీ లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లకు ఇప్పుడు విశేష ఆదరణ లభిస్తుంది . ప్రత్యేకించి తెలుగు వాటిని మరీ ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి వచ్చే ఈ వెబ్ సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

This Week Must Watch Web Series In OTT: ఓటీటీ లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లకు ఇప్పుడు విశేష ఆదరణ లభిస్తుంది . ప్రత్యేకించి తెలుగు వాటిని మరీ ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి వచ్చే ఈ వెబ్ సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ప్రతి వారంలానే ఈ వారం కూడా చాలానే సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి అడుగుపెడుతున్నాయి. కానీ ఇప్పుడు అందరు ఎదురుచూసేది మాత్రం ఈ మూడు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ల కోసం మాత్రమే. ఈ మధ్య ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు లభిస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు కంటెంట్ కు క్రేజ్ బాగా లభించడంతో.. గత కొన్ని వారాలుగా.. తెలుగులో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి రాబోయే ఈ వెబ్ సిరీస్ లను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ వెబ్ సిరీస్ లు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

బహిష్కరణ:

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ లో అంజలి వేశ్య పాత్రలో నటించారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు ఈ సిరీస్ పై మరింత ఇంట్రెస్ట్ పెంచేసింది. కాగా ఈ సిరీస్ లో అంజలితో పాటు.. రవీంద్ర విజయ్ , అనన్య నాగళ్ళ , శ్రీతేజ్ , షణ్ముఖ్ , మహబూబ్ , చైతన్య లాంటి నటులు ముఖ్య పాత్రలో నటించారు. కాగా ఈ సిరీస్ కు ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ జూలై19 న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ కు రానుంది.

నాగేంద్రన్స్ హనీమూన్స్:

ఇప్పటికే ఈ సిరీస్ గురించి టాక్ వచ్చిన దగ్గర నుంచి ఈ సిరీస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని.. ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇది మలయాళం నుంచి రూపొందించిన సిరీస్ అయినా కూడా.. ఈ సిరీస్ ను తెలుగు, తమిళం , హిందీ , కన్నడ , బెంగాలీ , మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సిరీస్ ట్రైలర్ అందరిని మెప్పించింది. ఇక ఈ సిరీస్ లో కని కస్తూరి, శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ, రమేశ్ పిషరోడీ, కళాభవన్ షాజాన్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా ఈ సిరీస్ కు నితిన్ రెంజీ పనికర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూలై 19నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది.

త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్

ఈ సిరీస్ అంతా కూడా ఓ చార్టెడ్ అకౌంటంట్ అయినా త్రిభువన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్ లో మానవ్ కౌల్‍తో పాటు తిలోత్తమ షోమ్, శ్వేత బసు ప్రసాద్, శుభ్రజ్యోతి బారత్, ఫైజల్ మాలిక్, జితిన్ గులాటీ, అశోక్ పాఠక్, నైనా సరీన్, సుమీత్ గులాటీ ముఖ్య పాత్రలలో నటించారు. పైగా ఈ సిరీస్ మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్ నుంచి రూపొందించబడింది. దీనితో ఈ సిరీస్ పై అందరికి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సిరీస్ జూలై 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కాబట్టి ఈ వారం ఓటీటీ లో ఈ సిరీస్ లను అసలు మిస్ కాకుండా చూడండి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments