Tirupathi Rao
Most Watched Web Series In 2024: ఓటీటీలో చాలానే సినిమాలు, చాలా చాలా వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, ఏది చూడాలో ఒక పట్టాన తెలియదు. అలాంటి కన్ ఫ్యూజన్ మీకు కూడా ఉందా? అయితే ఒకసారి ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ల లిస్ట్ ఉంది. వాటిలో మీరు మిస్ అయిన సిరీస్లు ఏమైనా ఉన్నాయోమే చూడండి.
Most Watched Web Series In 2024: ఓటీటీలో చాలానే సినిమాలు, చాలా చాలా వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, ఏది చూడాలో ఒక పట్టాన తెలియదు. అలాంటి కన్ ఫ్యూజన్ మీకు కూడా ఉందా? అయితే ఒకసారి ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ల లిస్ట్ ఉంది. వాటిలో మీరు మిస్ అయిన సిరీస్లు ఏమైనా ఉన్నాయోమే చూడండి.
Tirupathi Rao
ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్లకన్నా.. ఇంట్లో అందరితో కలిసి ఓటీటీలో సినిమాలు, సిరీస్లు చూసే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది. అందరూ ఒకటికి మించే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. అయితే వాటిలో ఏం సినిమాలు చూడాలే తెలియదు. ఎలాంటి సినిమాలు చూడాలో తెలియదు. ఒక్కోసారి సినిమాలు వెతుక్కోవడానికే సగం సమయం సరిపోతుంది. అలాంటి వారి కోసం మేము సజీషన్స్ కూడా ఇస్తున్నాం. వాటికి అదనంగా ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు, సిరీస్లు ఎక్కువగా చూస్తున్నారు? ఈ ఏడాదిలో ఎలాంటి సినిమాలు, సిరీస్లకు మంచి ఆదరణ లభించిందో చూద్దాం. అలా అయితే మీరు మిస్ అయిన్ బెస్ట్ కంటెంట్ ఉంటే చూసేయచ్చు.
సాధారణంగా చాలామంది ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు చూసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందుకు ఒక ప్రధాన కారణం వెబ్ సిరీస్లు ఇంట్రెసటింగ్ గా ఉండటం. అలాగే ప్రతిరోజు ఒక సినిమా కోసం టైమ్ వేస్ట్ చేసుకునే పని ఉండదు కాబట్టి. అయితే మీరు కూడా అలాంటి ఒక మైండ్ సెట్ తో ఉంటే వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలను ఎంజాయ్ చేయచ్చు. ఈ టాప్ లిస్టులో ఎక్కువ మంది వెబ్ సిరీస్లనే చూసేశారు. 2024 జనవరి నుంచి జూన్ మధ్య ఎక్కువగా చూసిన సిరీస్లు/ సినిమాల లిస్టులో అమెజాన్ లో ఉన్న పంచాయత్ సీజన్ 3 (2.82 కోట్ల మంది) ఉంది. సాధారణంగానే ఈ సిరీస్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ అది మరోసారి రుజువైంది. ఇంక రెండో ప్లేస్ లో నెట్ ఫ్లిక్స్ లోని హీరామండి (2.30 కోట్ల మంది) ఉంది. మూడో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఇండియన్ పోలీస్ ఫోర్స్ (1.95 కోట్ల మంది) ఉంది.