దర్శకధీరుడు రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ.. ఆ OTTలోనే స్ట్రీమింగ్!

Modren Masters A Documentary On Director Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి జీవితంపై ఒక డాక్యూమెంటరీ రాబోతోంది. ఆయన సినిమాలు, జీవితం, విజయన్ ఇలా అనేక విషయాలపై ఈ డాక్యూమెంటరీ ఉండే ఛాన్స్ ఉంది.

Modren Masters A Documentary On Director Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి జీవితంపై ఒక డాక్యూమెంటరీ రాబోతోంది. ఆయన సినిమాలు, జీవితం, విజయన్ ఇలా అనేక విషయాలపై ఈ డాక్యూమెంటరీ ఉండే ఛాన్స్ ఉంది.

గతంలో వరల్డ్ సినిమాలో ఇండియన్ సినిమా ప్రస్తావన వస్తే బాలీవుడ్ గురించే చెప్తారు. ఆంటే ఇండియన్ సినిమాకి బాలీవుడ్ ముఖచిత్రం అన్నట్లు. కానీ, ఎప్పుడైతే రాజమౌళి పాన్ ఇండియా బాట పట్టాడో.. అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ లెవల్లో ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ గురించే మాట్లాడుతున్నారు. రాజమౌళి వేసిన ఆ బాటలో ఇప్పుడు చాలామందే డైరెక్టర్లు పాన్ ఇండియా బాట పట్టారు. అద్భుతమైన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లారు. అందుకు ఆజ్యం పోసింది మాత్రం జక్కన్న అని చెప్పాల్సిందే. ఆ తర్వాత తాను ప్రపంచ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ గ్లోబల్ సినిమా తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళి జీవితంలో చాలానే మైలురాళ్లు ఉన్నాయి వాటిని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆయన జీవితం మీద ఒక డాక్యూమెంటరీ వస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న గురించి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విజన్ తో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. ప్రపంచం మొత్తం కీర్తించిన డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ తో ది బెస్ట్ డైరెక్టర్ అని ప్రశంసించేలా చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి తెలుగు సినిమాలో ఉన్నందుకు కచ్చితంగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా ఒక డాక్యూమెంటరీ రాబోతోంది అంటే అది చిన్న విషయం అయితే కాదు.

రాజమౌళి జీవితంపై డాక్యూమెంటరీ వస్తున్న విషయం అయితే నూటికి నూరు శాతం నిజమే. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ డాక్యూమెంటరీని అప్లాజ్ అండ్ ఫిల్మ్ కంపానియన్ సమర్పణలో నెట్ ఫిక్స్ సంస్థ నిర్మిస్తోంది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరిట ఈ డాక్యుమెంటరీ ఉంటుంది. ఉందులో దిగ్గజ డైరెక్టర్లు జేమ్స్ కామెరూన్, జో రోసో కామెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ వ్యూస్ ని, ఒపినీయన్స్ ని షేర్ చేసుకున్నారు అని చెబుతున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి చూపిస్తారా? లేక బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ డాక్యూమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇంక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అయితే రెడీగా ఉంది. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ నడుస్తోంది. అటు మహేశ్ కూడా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీ ఆడియన్స్ టార్గెట్ ఈ సినిమా కథ రాసుకున్న విషయం తెలిసిందే. మరి.. జక్కన్న మీద డాక్యూమెంటరీ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments