iDreamPost
android-app
ios-app

మీర్జాపూర్ 3 ట్రైలర్ రిలీజ్.. ఈసారి వైలెన్స్ మీ ఊహకు కూడా అందదు!

  • Published Jun 20, 2024 | 2:56 PM Updated Updated Jun 20, 2024 | 2:56 PM

Mirzapur Season 3 Trailer Review And Release Date: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ అయితే వచ్చేసింది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక స్ట్రీమింగ్ డేట్ ని కూడా ప్రకటించింది.

Mirzapur Season 3 Trailer Review And Release Date: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ అయితే వచ్చేసింది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక స్ట్రీమింగ్ డేట్ ని కూడా ప్రకటించింది.

  • Published Jun 20, 2024 | 2:56 PMUpdated Jun 20, 2024 | 2:56 PM
మీర్జాపూర్ 3 ట్రైలర్ రిలీజ్.. ఈసారి వైలెన్స్ మీ ఊహకు కూడా అందదు!

పాన్ ఇండియా లెవల్లో గత కొన్ని నెలలుగా అందరూ ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మీర్జాపూర్ సీజన్ 3 అనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎంతగానో ఎదురుచూశారు. అలాంటి ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ట్రైలర్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా.. రిలీజ్ డేట్ ని కూడా చెప్పేశారు. మరి.. మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ ఎలా ఉంది? మీర్జాపూర్ లో ఈసారి ఏం జరగబోతోంది. ఎవరు మీర్జాపూర్ లో గద్దెను ఎక్కబోతున్నారు? కొత్తగా మీర్జాపూర్ లోకి ఎవరు వచ్చారు? ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి? పంకజ్ త్రిపాఠి ఏమయ్యాడు? ఇవన్నీ మీర్జీపూర్ సీజన్ 3లో ఉండబోతున్నాయి. మరి.. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

మీర్జాపూర్ వెబ్ సిరీస్ గురించి పాన్ ఇండియా లెవల్లో ఉన్న ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా హయ్యెస్ట్ వ్యూవర్ షిప్ తో మీర్జాపూర్ రెండు సీజన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే రెండో సీజన్ ముగింపులో దాదాపుగా పంకడ్ త్రిపాఠిని చంపేసేవాళ్లు. కానీ, పంకజ్ త్రిపాఠి తప్పించుకున్నాడు. కానీ, అతని కొడుకు కాలిన్ భయ్యా మాత్రం చనిపోయాడు. అలాగే బీనా ఆంటీ తన కొడుకు ప్రణాలు కాపాడుకోవడం కోసం గుడ్డు భయ్యా పంచన చేరింది. అయితే వాళ్లిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించినట్లు ఈ ట్రైలర్ లో చూపించారు.

Mirzapur3

గుడ్డు భయ్యాని తనకు అనుకూలంగా గైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మీర్జాపూర్ లో గుడ్డు హవా స్టార్ట్ అయ్యింది. అలాగే శత్రువుల సంఖ్య కూడా పెరిగిపోయింది. మరోవైపు కాలిన్ భయ్యా భార్య విధవిరాలిగా మారిపోయింది. అలాగే రాజకీయంగా గుడ్డు భయ్యాని ఎంత ఇబ్బంది పెట్టాలా అని ప్రయత్నాలు చేస్తోంది. అలాగే పంకజ్ త్రిపాఠి కూడా తిరిగి రావడానికి చాలానే పథకాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి సీజన్లో మాత్రం అన్నీ ఎక్కువగానే ఉండేలా కనిపిస్తున్నాయి. వైలెన్స్, ఎమోషన్, యాక్షన్, రొ*మ్యాన్స్ కూడా కాస్త డోసు పెంచినట్లు ఉన్నారు. ముఖ్యంగా రక్తపాతం మాత్రం కచ్చితంగా ఉంటుంది.

ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్స్ మాత్రం గుడ్డు భయ్యా మీర్జాపూర్ ని ఏలడం చూపిస్తారు. ఆ తర్వాత పంకజ్ త్రిపాఠి మాత్రమే కాకుండా మిగిలిన శత్రువులు కూడా మీర్జాపూర్ లోకి అడుగుపెడతారు. అక్కడి నుంచే అసలు ఆట మొదలవుతుంది. ఎవరు ఎవరిని చంపుతారు? ఎవరు ఆ కుర్చీని ఎక్కుతారు? ఎవరు ప్రాణాలతో ఉంటారు? ఈ మూడు ప్రశ్నలు మాత్రం ఆడియన్స్ బుర్రను తొలిచేస్తూ ఉంటాయి. ఇంక ఈ మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. మరి.. మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet