Swetha
Golam Movie OTT: తెలుగు, తమిళం , మలయాళం అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్స్ సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రత్యేకించి మలయాళీ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది.
Golam Movie OTT: తెలుగు, తమిళం , మలయాళం అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్స్ సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రత్యేకించి మలయాళీ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది.
Swetha
ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలు ఇవే.. ఈ వారం ఈ సినిమాలను మిస్ చేయకండి అంటూ.. ప్రతి వారం ఓటీటీ లో ఉండే ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక అవి మాత్రమే కాకుండా కొన్ని సినిమాలు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. అందులోను ఇదొక మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కాబట్టి మీ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమా కూడా యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం.
మలయాళీ సినిమాలను స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. అందులోను ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ను.. స్క్రీన్ పైన ఇంట్రెస్టింగ్ గా చూపించడంలో.. మలయాళీ మేకర్స్ ఒక డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతారు. ఇక ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా పేరు.. “గోలం”. అయితే ఈ సినిమాలో దర్శకుడు దగ్గర నుంచి నటి నటుల వరకు అందరూ కొత్తవారే.. అయినా కూడా కమర్షియల్ పరంగా మంచి హిట్ ను అందుకుంది. జూన్ 7 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఇక ఇప్పుడు శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి ఓటీటీ లో ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.
ఇక గోలం సినిమా కథ విషయానికొస్తే.. ఓ పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లో.. అందరు ప్రతి రోజు లానే ఎవరి పనిలో వారు ఉంటారు. ఇలా అందరు అక్కడే ఉండగానే జాన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురి అవుతారు. ఆ వ్యక్తి పొలిటికల్ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అవ్వడంతో.. ఆ మర్డర్ కేసు క్షణాల్లోనే సంచలన వార్తాగా మారుతుంది. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్ణ అనే వ్యక్తి రంగంలోకి దిగుతాడు. ఆ ఆఫీస్ లో వారే జాన్ ను హత్య చేసి ఉంటారని.. అతను అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ హత్య చేసింది ఎవరు ? ఆ పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు ? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.