iDreamPost
android-app
ios-app

Kurangu Pedal OTT: తండ్రి కొడుకుల హార్ట్ టచింగ్ సినిమా… ఒకేసారి రెండు OTT ల్లోకి!

  • Published Jun 15, 2024 | 11:57 AM Updated Updated Jun 15, 2024 | 11:57 AM

కొన్ని సినిమాలు ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు వచ్చి.. ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే. మరి ఈ సినిమా ఏంటో ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కొన్ని సినిమాలు ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు వచ్చి.. ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే. మరి ఈ సినిమా ఏంటో ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 15, 2024 | 11:57 AMUpdated Jun 15, 2024 | 11:57 AM
Kurangu Pedal OTT: తండ్రి కొడుకుల హార్ట్ టచింగ్ సినిమా…   ఒకేసారి రెండు OTT ల్లోకి!

ఈ వారం ఓటీటీ లోకి చాలా సినిమాలు వచ్చాయి. కాబట్టి ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పి తీరాలి. కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంటే మరి కొన్ని సినిమాలు సడెన్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాలైతే ఒకేసారి రెండు ఓటీటీ లలో ప్రత్యేక్షమవుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ వారం రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే .. ఈ వీకెండ్ ఈ సినిమాను మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ రావాలంటే అసలు ఈ సినిమా కథేంటో కొంచెం అయినా తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా చూసిన వారికి ఖచ్చితంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తాయి. ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. అలనాటి చైల్డ్ హుడ్ మెమరీస్ ను గుర్తు చేసుకుంటూ.. దర్శకురాలు కమల కన్నన్ ఈ సినిమాను తెరకెక్కించింది. ఎలాగైనా సరే సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు.. తనకు సైకిల్ నడపడం రాని అతని తండ్రి తన కొడుకుకు ఎలా సైకిల్ నడిపించడం నేర్పించాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకులు ఎదుర్కున్న ఎమోషనల్ సీన్స్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే.. కురంగు పెడల్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

Kurungu Pedal

స్టోరీ ప్లాట్ చిన్నదే అయినా కానీ.. దర్శకుడు సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ను చూపించిన విధానం మాత్రం.. అందరిని కట్టిపడేసిందని చెప్పి తీరాలి. ఈ సినిమాకు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. మే 3 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా జూన్ 14 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరి కొన్ని రోజుల్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి . పైగా ఈ సినిమా ఏకంగా ఒకేసారి రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తమిళ్ , అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే ఈ సినిమాను.. మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.