iDreamPost
android-app
ios-app

OTT Movie : సైలెంట్ గా OTT లోకి రామ్‌గోపాల్ వ‌ర్మ‌ హీరోయిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 29, 2024 | 4:30 AMUpdated Jul 29, 2024 | 4:30 AM

ఓటీటీ లో ప్రస్తుతం సోసియో ఫాంటసి థ్రిల్లర్ మూవీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో ప్రస్తుతం సోసియో ఫాంటసి థ్రిల్లర్ మూవీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 29, 2024 | 4:30 AMUpdated Jul 29, 2024 | 4:30 AM
OTT Movie : సైలెంట్ గా OTT లోకి రామ్‌గోపాల్ వ‌ర్మ‌ హీరోయిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ మధ్య ఓటీటీ లో కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అందులోను ప్రస్తుతం ఓటీటీలో సోసియో ఫాంటసి థ్రిల్లర్ మూవీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ మూవీ మరేదో కాదు.. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ మూవీలో లక్ష్మి పార్వతి పాత్రలో నటించిన.. య‌జ్ఞ శెట్టి.. హీరోయిన్ గా చేసిన మూవీ.. యాక్ట్ 1978. ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలను చూసేద్దాం.

యాక్ట్ 1978 ఇదొక కన్నడ మూవీ.. ఈ సినిమాకు మంజునాథ సోమ‌కేశ‌వ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో సంచారీ విజ‌య్‌, శృతి, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా 2020 లోనే థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఆ సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి రావడం విశేషం. ఇక ఈ సినిమాలో యజ్ఞ శెట్టి నటన విషయానికొస్తే.. సినిమాలో తన పాత్రకు ప్రాణం పెట్టి నటించిందని చెప్పి తీరాలి. పైగా ఈ ఏడాది.. క‌న్న‌డంలో ఉత్త‌మ న‌టిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో యజ్ఞ శెట్టి భర్త చనిపోతాడు . దీనితో వింతంతువు అయినా ఆమెకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంది. ఆ ఆర్ధిక సహాయం కోసం ఆమె ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతుంది. ఆమె తన కష్టాలను చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు. లంచం ఇస్తేనే ఆమెకు రావాల్సిన డబ్బులను ఇస్తామని చెప్తూ ఉంటారు. దీనితో అప్పటికే విసిగిపోయిన ఆమె.. ఆ ప్రభుత్వ అధికారులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతుంది. ఆమె తన ఒంటికి బాంబు ధరించి ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్తుంది. అక్కడ అధికారులను బందీలను చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆమె తానూ అనుకున్నట్లుగా అధికారులకు బుద్ధి చెప్పిందా లేదా ? చివరికి ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి