iDreamPost
android-app
ios-app

ఆక్వామ్యాన్- 2 వచ్చేస్తోంది.. ఈసారి ఫ్రీగానే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 15, 2024 | 6:43 PM Updated Updated May 15, 2024 | 6:43 PM

Aquaman 2 To Stream For Free: జేసన్ మొమోవా- ఆంబర్ హార్డ్ నటించిన ఆక్వామ్యాన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసింది. ఆ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. అయితే అది ఓటీటీలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. కానీ, ఇప్పుడు ఆ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.

Aquaman 2 To Stream For Free: జేసన్ మొమోవా- ఆంబర్ హార్డ్ నటించిన ఆక్వామ్యాన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసింది. ఆ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. అయితే అది ఓటీటీలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. కానీ, ఇప్పుడు ఆ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.

  • Published May 15, 2024 | 6:43 PMUpdated May 15, 2024 | 6:43 PM
ఆక్వామ్యాన్- 2 వచ్చేస్తోంది.. ఈసారి ఫ్రీగానే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ ప్రేక్షకులకు కాస్త యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తగ్గినట్లు అనిపిస్తోంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఒక బెస్ట్ హాలీవుడ్ యాక్షన్ సినిమా కూడా కనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా రిలీజ్ అయినా కూడా వెంటనే రెంట్ బేసిస్ లో పెట్టేస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఓటీటీలో చూద్దామంటే కుదరడం లేదు. ఇలా చాలామంది అభిమానులు బాధ పడుతున్నారు. అలాంటి వారికి ఇది ఒక క్రేజీ వార్త అనే చెప్పాలి. ఎందుకంటే హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆక్వామ్యాన్ 2 ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. ఇన్నాళ్లు రెంట్ కి అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు ఫ్రీగా చూసేందుకు అవకాశం దక్కుతోంది.

హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో ఆక్వామ్యాన్ కు చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఆక్వామ్యాన్ మూవీకి ఇటు తెలుగులో కూడ మంచి ఆదరణ లభించింది. ఇప్పటికీ ఓటీటీలో ఆక్వామ్యాన్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఒక సముద్ర యువరాణి- ఒక సామాన్యుడి ప్రేమకు గుర్తుగా ఆక్వామ్యాన్ జన్మిస్తాడు. అతను అటు భూమిపై జీవించగలడు.. ఇటు సముద్రంలో కూడా బతకగలడు. ఈ రెండు సామ్రాజ్యాలు, ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉండేవాడే ఆక్వామ్యాన్. తొలి పార్ట్ కు ఎంతో మంచి అప్లాజ్ లభించింది. జేసన్ మొమోవా, ఆంబర్ హార్డ్ లకు ఈ మూవీ ఒక మైల్ స్టోన్ లాంటిది. ఈ చిత్రాన్ని 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా 1.1 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. పార్ట్ 1 నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Aquaman

పార్ట్ వన్ అంత సక్సెస్ సాధించిన తర్వాత కచ్చితంగా పార్ట్ 2ని తెరకెక్కిస్తారు. అలాగే మేకర్స్ ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీని 215 మిలియన్ డాలర్లతో తెరకెక్కిస్తే.. కేవలం 434 మిలియన్ డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే ఇందుకు మూవీ కారణం కాకపోవచ్చు. ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన ఆంబర్ హార్డ్ పై ఉన్న వ్యతిరేకత ఆక్వామ్యాన్ 2 సినిమాని బ్యాడ్ చేసింది. నిజానికి ఎంతో మంచి కలెక్షన్స్ సాధించాల్సింది. కేవలం హీరోయిన్ మీద ఉన్న కోపంతోనే థియేటర్లలో ఈ మూవీని చూడకుండా దూరం పెట్టారు. నిజానికి మేకర్స్ ఆంబర్ హార్డ్ ని తప్పించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే చాలా వరకు సినిమా కంప్లీట్ కావడంతో.. ఇంక రిస్క్ తీసుకోలేకపోయారు.

ఈ ఆక్వామ్యాన్: ది లోస్ట్ కింగ్డమ్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండ్ బేసిస్ మీద అందుబాటులో ఉంది. మీరు ఈ మూవీని చూడాలి అంటే రూ.149 చెల్లించి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కి జియో సినిమా గుడ్ న్యూస్ చెప్పేసింది. అదేంటంటే.. మే 21 నుంచి ఆక్వామ్యాన్ ది లోస్ట్ కింగ్డమ్ జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇన్నాళ్లు రెంట్ అని చెప్పి చూడకుండా ఉన్న యాక్షన్ ప్రియులు మే 21 నుంచి ఎంచక్కా.. జియో సినిమాలో చూసేయచ్చు. ఒకవేళ మీకు ప్రీమియం సబ్ స్క్రిప్షన్ లేకపోయినా.. నెలకు కేవలం రూ.29 చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet