OTT Action Comedy Movie: OTTలోకి 'బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై' మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTTలోకి ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Action Comedy Movie: కామెడీ మూవీస్ కు ఈ మధ్యన బాగానే క్రేజ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Action Comedy Movie: కామెడీ మూవీస్ కు ఈ మధ్యన బాగానే క్రేజ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

వారం వారం రకరకాల జోనర్స్ లో ఓటీటీ లో ఇప్పటికే చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని వారాలుగా ఓటీటీ లో కామెడీ మూవీస్ ట్రెండ్ కొనసాగుతుంది. వీటిలో కూడా రొమాంటిక్ కామెడీ అని.. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని ఇలా రకరకాల ప్లాట్స్ ను మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వీటికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంది. ఈ క్రమంలో ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇపుడు హాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా.. దాదాపు ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో .. “బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై” అనే మూవీ జూన్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ఈ ఏడాది రిలీజ్ అయినా సినిమాలలో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా సూపర్ సక్సెస్ టాక్ సంపాదించుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కు తీసురానున్నారు. కాబట్టి ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ను అసలు మిస్ చేయకుండా చూడండి.

బ్యాడ్ బాయ్స్ సిరీస్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ సిరీస్ లో వచ్చిన నాలుగో సినిమానే బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై .. 2020 లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఆఫ్ లైఫ్ సినిమాను ఈ సినిమా సిక్వెల్. కాగా ఈ సినిమాకు ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. చనిపోయిన కెప్టెన్ కాన్రాడ్ హోవార్డ్ పై కొంతమంది తప్పుడు కేసును ఆరోపిస్తారు. ఈ క్రమంలో మియామి డిటెక్టివ్స్ అయినా మైక్ లౌరీ, మార్కస్ బర్నెట్ ఈ కేసును ఛేదించే పనిలో ఉంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది తెరపై చూడాల్సిన కథ. అయితే ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ , జీ 5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments