iDreamPost
android-app
ios-app

అఫీషియల్: OTTలోకి హన్సిక సోలోగా చేసిన క్రేజీ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 05, 2024 | 10:00 PM Updated Updated Jun 05, 2024 | 10:00 PM

Hansika New Horror Movie OTT Release Date: హన్సికను ఇప్పటివరకు మీరు లవర్ గా, పక్కింటి అమ్మాయిగా చూసుంటారు. కానీ, ఒక హారర్ చిత్రంలో చూశారా? ఒక భయపెట్టే పాత్రలో చూశారా? ఈ మూవీలో మాత్రం హన్సిక కచ్చితంగా కంగారు పెట్టేస్తుంది.

Hansika New Horror Movie OTT Release Date: హన్సికను ఇప్పటివరకు మీరు లవర్ గా, పక్కింటి అమ్మాయిగా చూసుంటారు. కానీ, ఒక హారర్ చిత్రంలో చూశారా? ఒక భయపెట్టే పాత్రలో చూశారా? ఈ మూవీలో మాత్రం హన్సిక కచ్చితంగా కంగారు పెట్టేస్తుంది.

  • Published Jun 05, 2024 | 10:00 PMUpdated Jun 05, 2024 | 10:00 PM
అఫీషియల్: OTTలోకి హన్సిక సోలోగా చేసిన క్రేజీ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హన్సిక మోటవాని.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ స్టార్ హీరోయిన్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఇటీవల కాస్త సినిమాలకు గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఓటీటీలో మాత్రం హన్సిక సినిమాలు వరుసగా దూసుకుపోతున్నాయి. తాజాగా హన్సిక చేసిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అది కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించి చాలానే బజ్ ఏర్పడింది. నిజానికి ఈ మూవీ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రయోగం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ మూవీలో కేవలం హన్సిక మాత్రమే యాక్ట్ చేసింది.

సాధారణంగా యాక్టర్స్ ఇలాంటి ఒక ఛాలెంజింగ్ మూవీ జోలికి వెళ్లరు. కానీ, హన్సిక్ మాత్రం చాలా రిస్క్ తీసుకుంది అనే చెప్పాలి. ఎందుకంటే మరో యాక్టర్ లేకుండా కేవలం ఒక్క ఆర్టిస్ట్ మాత్రమే సినిమా మొత్తం చేయాలి అంటే అది చిన్న విషయం అయితే కాదు. కానీ, హన్సిక మాత్రం చాలా కష్టపడినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. కొన్ని సైకిక్ ఎలిమెంట్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇదంతా హన్సికతో హన్సికకు జరిగే ఒక యుద్ధం తరహాలో కనిపిస్తోంది.

నిజానికి ఈ మూవీకి కాస్త నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి కాస్త్ నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ, ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ని చాలా మంది థియేటర్లో చూడాలి అనుకోరు. కానీ, ఓటీటీ అంటే మాత్రం కచ్చితంగా చూస్తారు. పైగా ఈ మూవీ రైట్స్ తీసుకుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కావడంతో ఆ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎందుకంటే ఆహాలో మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనే ముద్ర పడిపోయింది. కాబట్టి ఆడియన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆహా ప్లాట్ ఫామ్ చేసింది. ఈ మూవీ వారి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది అంటూ తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేశారు. హన్సిక పోస్టర్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఎప్పుడూ క్యూట్ క్యూట్ స్మైల్ తో ఆడియన్స్ హృదయాలకు గాయం చేసే ఈ అమ్మడు ఇప్పుడు ఈ మూవీతో వారిలో వణుకు పుట్టించేందుకు రెడీ అయిపోతోంది. ఈ మూవీ మరేదో కాదు.. ‘105 మినిట్స్’. ఈ మూవీ జూన్ 7 నుంచి ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి.. హన్సిక మూవీ ఓటీటీలోకి వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss